తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల - మీ పేరు ఇలా చెక్‌ చేసుకోండి - State Election Commission - STATE ELECTION COMMISSION

SEC Release Panchayath Voter List : రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,867 గ్రామ పంచాయతీలలో 1,13,722 వార్డుల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 82,04,518 పురుషులు, 85,28,573 మహిళలు, 493 ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది.

SEC Release Panchayath Voter List
SEC Release Panchayath Voter List (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 5:22 PM IST

Updated : Oct 3, 2024, 5:28 PM IST

SEC Release Panchayath Voter List : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. మొత్తంగా 12,867 గ్రామ పంచాయతీలలో 1,13,722 వార్డుల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో 82,04,518 పురుషులు, 85,28,573 మహిళలు, 493 ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపింది.

అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు, అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో electoralsearch.eci.gov.in చెక్‌ చేసుకోండి.

Last Updated : Oct 3, 2024, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details