Srivari Arjita Seva Tickets in Tirupati District :శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులైకు సంబంధించిన సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవల లక్కీ డిప్నకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన వారు చెల్లింపులు చేసి ఖరారు చేసుకోవాలని టీటీడీ పేర్కొంది.
శ్రీవారి సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ - ఎప్పుడంటే? శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమలలో ఆ సేవలన్నీ రద్దు! - TTD Vasanthotsavam
Tirumala Tirupati Devastanam :ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవా టికెట్లును టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు వర్చువల్ సేవా టికెట్లతో పాటు స్వామి వారి దర్శన స్లాట్లను కూడా విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు శ్రీవారి అంగ ప్రదక్షిణం టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు టోకెన్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
తిరుమల టైం స్లాట్ టోకెన్ల జారీలో ప్రైవేట్ వాహన డ్రైవర్ల మోసాలు- భక్తులకు తీవ్ర ఇక్కట్లు! - Tirumala Time Slot Tokens Issue
Tirumala Ticket Issue Date :తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. శ్రీవారి సర్వ దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం శ్రీవారిని 77,511 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,553 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు అని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.