ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగదేకవీరుడి కల్యాణానికి వేళాయె - శ్రీరామనవమి వేడుకకు ముస్తాబైన భద్రాద్రి - Bhadradri Ramayya Kalyanam 2024 - BHADRADRI RAMAYYA KALYANAM 2024

Sri Rama Navami 2024 : లోక కల్యాణంగా భావించే శ్రీ సీతారాముల కల్యాణ వేడుకతో తెలంగాణలోని భద్రాద్రి దివ్యక్షేత్రం కాంతులీనుతోంది. జగదానంద కారకుడు, జగదభిరాముడు, దశరథ పుత్రుడిగా తీరొక్కపేరుతో పిలుచుకునే సీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకతో భద్రాద్రి పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ కల్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తకోటి వేయికళ్లతో ఎదురుచూస్తోంది.

Sri Rama Navami 2024
Sri Rama Navami 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 7:50 AM IST

జగదేకవీరుడి కల్యాణానికి వేళాయె - శ్రీరామనవమి వేడుకకు ముస్తాబైన భద్రాద్రి

Sri Rama Navami 2024 : జగదేక వీరుడు జానకిరాముడు, అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం తెలంగాణలోని భద్రాచలం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కల్యాణ ఘట్టానికి(Sita Rama Kalyanam 2024) సంబంధించిన పూజలు కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. అభిజిత్ లగ్నంలో కల్యాణం జరగనుండగా ముందుగా తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు.

Bhadradri Ramayya Kalyanam 2024 : కమనీయంగా సాగే కల్యాణ వేడుకకు ప్రతీ ఏటా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాములవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వైభవోపేతంగా సాగే ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు(Sri Rama Navami Live) వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

బాలరాముడికి లక్ష 'మఠడీ'ల నైవేద్యం- రామనవమి రోజు వచ్చే భక్తులకు 'మహా'ప్రసాదం - Mathadi Mahaprasad To Balakram

అన్ని ఏర్పాట్లు పూర్తి : ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, ఫ్యాన్లు, కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు శాఖ సుమారు 2 వేల మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

"3000 మంది కూర్చునే విధంగా పందిళ్లు వేయడం జరిగింది. భక్తులకు కావాల్సిన వసతులు, తాగునీరు , టాయిలెట్స్​, పార్కింగ్​ను కూడా ఏర్పాటు చేశాం. 15,000 టికెట్లు విక్రయిస్తున్నాము. మరో 15,000 టికెట్లు అమ్ముడవుతాయని భావిస్తున్నాం. ఎండలు ఎక్కువగా ఉండటం, ఏప్రిల్​ నెలలో శ్రీరామనవమి రావడంతో 30,000 టికెట్లు అందుబాటులో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం. బయట నుంచి వచ్చే భక్తుల కోసం ఉచిత వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ ఉండి కల్యాణం, పట్టాభిషేకం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు."- ప్రియాంక అల, కలెక్టర్​

530 పేజీల 'బంగారు' రామాయణం.. రామనవమి రోజు మాత్రమే దర్శనం.. ఎంత బాగుందో!

Sri Rama Navami 2024 Celebrations in Bhadrachalam: తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మొదటిదైన ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి భక్తుల జయ జయధ్వానాల మధ్య వైభవోపేతంగా సాగింది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సాగిన ఎదుర్కోలు వేడుక భక్తులను రంజింపజేసింది. ఆలయ వైదిక పెద్దలు, ఆచార్యులు రాములవారు, సీతమ్మ గుణ గణాలను కీర్తించిన సన్నివేశాలు భక్తులను ఆద్యంతం ఆనంద డోలికల్లో ముంచెత్తాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో చివరిదైన మహా పట్టాభిషేకం(Sri Ram Mandir) గురువారం జరగనుంది.

5లక్షల దీపాలతో 150 అడుగుల శ్రీరాముడి చిత్రం

ABOUT THE AUTHOR

...view details