Fake Ticket Alert For SRH vs RCB IPL Match :ఐపీఎల్ వచ్చిందంటే చాలు నా టీమ్ అంటూ నెటిజన్లు వాళ్ల అభిమాన జట్లకు సపోర్ట్ చేస్తుంటారు. అలా ప్రతీ ఐపీఎల్ టీమ్‌కు ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండే టీమ్ మ్యాచ్‌లు జరుగుతుంటే మాత్రం అభిమానులు ఆ ఆటను వార్‌లాగా ఊహించుకుంటారు. అలాంటి మ్యాచ్‌లలో బెంగళూరు వర్సెస్ హైదరాబాద్‌కు మాంచి డిమాండ్ ఉంది. ఎలాగైనా ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలని టికెట్ల కోసం తెగ ట్రై చేస్తుంటారు క్రికెట్ ఫ్యాన్స్. దీన్నే అలుసుగా తీసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు.
VC Sajjanar Tweet on Fake Tickets :ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని నకిలీ లింకులను పంపిస్తున్నారు. మ్యాచ్ టికెట్లకు సంబంధింది నకిలీ రీళ్లు, స్టోరీలు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కరులు కొడుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. పొరపాటున వాటిని నమ్మి లింక్స్ ఓపేన్ చేసినా, వాటి ద్వారా టికెట్ కొనుగోలు చేసినా ఖాతాలోని డబ్బు గల్లంతవుతుందని హెచ్చరించారు. వాటి లింక్ ఓపెన్ చేసి వ్యక్తిగత సమాచారాలు ఇవ్వకూడదని తెలిపారు. మ్యాచ్ టికెట్లు హెచ్‌సీఏ పేటీఎంలో మాత్రమే అందుబాటులో ఉంచింది.
ఐపీఎల్ సన్ రైజర్స్ మ్యాచ్ టికెట్లు కావాలా? - ఇక్కడ పొందండి!
అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభిమానులు : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ టికెట్ విషయంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టికెట్ల్ దొరక్కపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కవ ధరలు గల టికెట్లు అందుబాటులో ఉంచడం లేదన్నారు. కాగా ఆర్సీబీ - ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లు విడుదల చేసిన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోవడంతో క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. దానికి సంబంధించిన వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా అదే మ్యాచ్‌కు సంబంధించి ఇలా సోషల్ మీడియాలో టికెట్లు ఉన్నాయంటూ స్టోరీలు, రీల్స్ వస్తుండడంతో అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.