తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యం నీళ్లతో కళకళలాడుతున్న జైలు బావులు - ఖైదీలతో కూరగాయల సాగు - Full Water In Nalgonda Jail Wells - FULL WATER IN NALGONDA JAIL WELLS

Spring Wells In Nalgonda District Jail : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు అడుగంటిపోయాయి. బిందెడు నీటికోసం ట్యాంకర్ల వద్ద గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. కానీ ఆ ఊటబావులు నడివేసవిలోనూ జలసిరులు కురిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలు పడిపోయినా ఆ బావుల్లో మాత్రం 20 అడుగుల లోతులోనే నీటి లభ్యత ఉండటం విశేషం. ఇంతకీ ఆ బావులు ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

Spring Wells In Nalgonda District Jail
Spring Wells In Nalgonda District Jail

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 1:31 PM IST

నిత్యం నీళ్లతో కళకళలాడుతున్న జైలు బావులు- ఖైదీలతో కూరగాయల సాగు

Spring Wells In Nalgonda District Jail :సాధారణంగా వేసవిలో బావుల్లో నీరు అడుగంటిపోవడం చూస్తుంటాం. కానీ నల్గొండ జిల్లా కారాగారానికి చెందిన బావుల్లో మాత్రం వేసవిలో జలకళ కనిపిస్తోంది. జిల్లాలో పలుచోట్ల భూగర్భజలాలు పడిపోయినా కారాగారంలోని రెండు బావుల్లో మాత్రం తగినంతగా నీరు ఉన్నాయి. వాటితో కూరగాయలు(vegetables) కూడా పండిస్తున్నారు. ఇంతకీ ఆ బావుల ప్రత్యేకత ఏంటో ఓ సారి తెలుసుకుందామా?

ఇక్కడ మనం చూస్తున్నది నల్గొండ జిల్లా కారాగారం. నల్గగొండ నడిబొడ్డున ఉన్న ఈ జైలు నిజాం పాలకుల హయాంలో 1916లో నిర్మించారు. అప్పటి నీటి అవసరాల నిమిత్తం కారాగారంలో రెండు ఊటబావులను తవ్వించారు. అప్పటి నుంచి ఈ రెండు బావులు జైల్లోని ఖైదీలకు, సిబ్బందికి తాగునీరు, మిగిలిన అవసరాలు తీరుస్తున్నాయి. ఈ బావుల్లోని నీటిని ఉపయోగించే జైల్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌(Mineral Water Plant) సైతం ఏర్పాటుచేశారు.

Full Water In Nalgonda Jail Wells :జైలు విస్తీర్ణం 10.06 ఎకరాల్లో ఉండగా అందులో 2.20 ఎకరాల్లో జైలు ప్రాంగణం, సుమారు 6 ఎకరాల్లో టేకు తోటలు ఉన్నాయి. మిగిలిన ప్రదేశంలో రోజూ ఖైదీలకు అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు, పండ్లతోటలు(Orchards) ఆర్గానిక్‌ పద్దతిలో(Organic Farming) సాగుచేస్తున్నారు. ఇప్పుడు ఈ కూరగాయలు సాగుకు సైతం ఈ రెండు బావుల్లోని(Wells) నీటినే వాడుతున్నారు. ఖైదీలచే పండించిన కూరగాయలను జైళ్లశాఖ ఆధ్వర్యంలో మార్కెట్లో విక్రయిస్తున్నారు.

20 అడుగుల లోతులోనే నీటి లభ్యత :వందేళ్ల క్రితం నల్గగొండ జిల్లా వ్యాప్తంగా అనేక బావులు తవ్వగా ప్రస్తుతం ఈ రెండింటిలోనే నీళ్లు ఉన్నాయని భూగర్భ జలవరుల శాఖ అధికారులు చెబుతున్నారు. నిజాం కాలంలో(Under The Nizam Rule) తవ్వించిన ఈ రెండు బావులు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భూగర్భజలాలుతీవ్రంగా పడిపోయినా ఈ బావుల్లో 20 అడుగుల లోతులోనే నీటి లభ్యత ఉండటం విశేషం.

"దాదాపు కొన్ని ఏళ్లుగా ఈ బావిలో నీళ్లు ఉన్నాయి. వేసవిలోను నీరు ఎప్పుడు ఎండిపోలేదు. బావిలో నీటిని ఉపయోగిస్తున్న కొద్ది ఊరుతూనే ఉన్నాయి. జిల్లాలో కరవు పరిస్థితుల వల్ల చుట్టుపక్కల బావులు ఎండిపోయినప్పటికీ ఈ బావి మాత్రం ఎండిపోకపోవడం విశేషం. నీరు వస్తునే ఉన్నాయి. గత యాబై ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. ఈ బావిలో నీరు పుష్కలంగా ఉండటంతో ఖైదీలచే కూరగాయలు పండిస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర కరవు పరిస్థితుల వల్ల బావిలో నీటి నిల్వ స్థాయిలు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ పూడిక తీయగానే మళ్లీ నీరు భర్తీ అయ్యాయి" - స్థానికులు

రాష్ట్రమంతా పంటలు ఎండుతున్నా - ఆ ఊర్లో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పొలాలే - కారణం ఏంటంటే? - Crops with spring wells

ఆ కాలనీలో 25 ఏళ్ల నుంచి నో వాటర్ ప్రాబ్లమ్ - ఎందుకో తెలుసా? - Precautions to Avoid Water Crisis

మోటార్ లేకుండా పంట సాగు - ఎలా సాధ్యమైందబ్బా

ABOUT THE AUTHOR

...view details