Special Trains To Prayagraj Maha kumbhamela From Telangana :ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జనవరి 14 నుంచి 45 రోజుల పాట జరిగే ఈ కుంభమేళ కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ తాజాగా 26 రైలు సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ, కాకినాడ టౌన్, మచిలీపట్నం నుంచి ఉంటాయని వివరించింది. తెలంగాణలోని మౌలాలి జంక్షన్, సికింద్రాబ్, వికారాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కుంభమేళకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తుల అవసరాలు, భద్రతా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తోంది. కాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగా స్నానం ఆచరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.