TDP Government Prioritizes Tourism in State : కూటమి ప్రభుత్వం పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తోంది. సందర్శకులను ఆకట్టుకునేలా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా టూర్ ప్యాకేజీలను విరివిగా అందుబాటులోకి తెచ్చారు. కాలానుగుణంగా కొత్త వాటితో పాటు ప్రాధాన్యం ఉన్న వాటిని కొనసాగిస్తున్నారు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు.
1. ప్యాకేజి : శక్తి పీఠాల పర్యటన
రోజులు :3
ధర : పెద్దలకు రూ.5980, పిల్లలకు రూ.4790 (నాన్‌ఏసీ)
ఇలా :మొదటి రోజు విశాఖలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి పిఠాపురం, ధ్రాక్షారామం, విజయవాడ, రెండో రోజు కనకదుర్గ అమ్మవారి దర్శనం, శ్రీశైలం, మూడో రోజు అలంపూర్.
2. ప్యాకేజి :పంచారామాలు
రోజులు : 2
ధర :పెద్దలకు రూ.1,685, పిల్లలకు రూ.1,350
ఇలా : మొదటి రోజు రాత్రి 7.30 గంటలకు విశాఖలో బయలుదేరి రెండో రోజు రాత్రి తిరిగొచ్చేలా ప్రణాళిక చేశారు.
3. ప్యాకేజి : విశాఖ సిటీ టూర్
రోజులు :ఒక రోజు
ధర :పెద్దలకు రూ.760, పిల్లలకు రూ.610, ఏసీ అయితే పెద్దలకు రూ.910, పిల్లలకు రూ.730,
ఇలా : ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
సందర్శించే ప్రాంతాలు :సింహాచలం, తొట్లకొండ, రుషికొండ బీచ్, కైలాసగిరి, విశాఖ మ్యూజియం, టీయూ-142, కురుసురా జలాంతర్గామి, రుషికొండలోని వేంకటేశ్వర స్వామి ఆలయం.
"గుంజివాడ గుసగుసలు" - జలపాతం అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు
4. ప్యాకేజి :అరకు రైలు, రోడ్డు
రోజులు:ఒక రోజు
ధర :పెద్దలకు రూ.1,710, పిల్లలకు రూ.1,370
ఇలా : ఉదయం 5.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై రాత్రికి తిరిగొస్తారు.