YS Jagan 5 Years Ruling: గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా జగన్ ఏంటి అంటే.? అందరికీ తెలిసిందల్లా బటన్ నొక్కడం, పరదాల చాటు తిరగడం, రికార్డెడ్, ఎడిటెడ్ వీడియోలు వదలటమే. ముఖ్యమంత్రిగా ఏ నాడు ఒక లైవ్ వీడియో సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించింది లేదు. మరి తెర వెనుక జగన్ ఏంటో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ప్రభుత్వం మారటంతో ముఖ్యమంత్రిగా జగన్ ఏం చేశాడనేది సచివాలయ అధికారులు కథకథలుగానే చెప్పుకుంటున్నారు. ఆ విషశేలు ఏంటో మనం చూద్దాం.
వినరో భాగ్యం జగన్ వింత పాలన అంటూ, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవడంతో గత ప్రభుత్వంలోని కొన్ని ఆసక్తికర ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సచివాలయానికి వచ్చినప్పుడు మనుషులనే కాదు, అక్కడి యంత్రాలను జగన్ నమ్మేవారు కాదు అనేది సచివాలయ అధికారుల మాట. 5 ఏళ్లళ్లో మంత్రివర్గం సమావేశానికి తప్ప ఒక్క సారి కూడా సచివాలయానికి రాలేదు. మొదటి బ్లాక్ లోని ముఖ్యమంత్రి చాంబర్ లో కూర్చోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. అధికారులను, కొత్త వ్యక్తులను, ఎలక్ట్రానిక్ డివైస్ లను అనుమానంగా చూసేవాడని సిబ్బంది చెబుతున్నారు. సీఎం చాంబర్ వద్ద ప్రభుత్వ, అధికారిక వైఫై సౌకర్యాన్ని కూడా సీఎం పేషీ సిబ్బంది వాడుకోకపోవడం నాటి ముఖ్యమంత్రి పేషికి దుస్థితికి అద్దం పడుతోంది.
'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్‌ను పరిశీలించిన కూటమి నేతలు - MLA GANTA ON RUSHIKONDA Buildings
2019లో అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న వైఫైను, ఎలక్ట్రానిక్ డివైస్ లను ఉపయోగించుకోవడానికి ఆయన యంత్రాంగం ఇష్టపడలేదని తెలుస్తోంది. సమావేశమందిరం లో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ లైట్ వెలుగుతుండడంతో "అదేంటి, ఇక్కడ ఎందుకు ఉంది" అంటూ నాడు సిబ్బందిని జగన్ ప్రశ్నించిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు. జగన్ ఆదేశాలతో వీడియో కాన్ఫరెన్స్ కు ఉపయోగించే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి పక్కన పెట్టేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సచివాలయానికి అప్పుడప్పుడు మాత్రమే రావాల్సి ఉండటంతో తాడేపల్లి లోని తన క్యాంప్ కార్యాలయంలో కోట్లు వెచ్చించి కొత్త వీడియో కాన్ఫెరెన్స్, ఇతర పరికరాలను కొనుగోలు చేశారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కొత్త సీఎం వస్తే కుర్చీలు, ఫర్నిచర్, సరిగా పనిచేయని వస్తువులు మాత్రమే మారుస్తారు అని, కానీ ప్రభుత్వ ఆధీనంలో ఉండే వైఫై నీ వాడడానికి ఇష్టపడని నాటి సీఎం జగన్ వైఖరిపై వింత వింత కథలు సచివాలయంలో చక్కర్లు కొడుతున్నాయి.