Special Story Bhanu Prakash From Nalgonda చేనేత కుటుంబ నుంచి ఎన్‌సీపీ అధికారిగా ఎదిగిన కుర్రాడిపై యువ కథనం Special Story Bhanu Prakash From Nalgonda :సాధారణంగా అంతా ఏదోఒక విభాగంలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. కానీ ఈ యువకుడి ప్రత్యేకతే వేరు. ఆటలపై ఉన్న ఆసక్తితో బాల్యం నుంచే వివిధ క్రీడల్లో రాణించాడు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. చదువు, ఆటలతో పాటు, ఎన్సీసీలోనూ తనదైన ముద్రవేశాడీ కుర్రాడు.
ఈ యువకుడి పేరు భాను ప్రకాశ్. నల్లగొండ జిల్లా ఆలేరులో ఒక చేనేత కుటుంబంలో జన్మించాడు. పాఠశాల స్థాయి నుంచే ఆటల్లో చురుగ్గా పాల్గొనేవాడు. పీఐటీల ప్రోత్సాహంతో క్రికెట్, కబడ్డీ, టార్గెట్ బాల్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి క్రీడల్లో రాణించాడు.
గగనతలంలో గస్తీ కాసేందుకు సిద్ధమైన క్యాడెట్స్ - శిక్షణ పూర్తి చేసుకున్న 213 మంది
పాల్గొన్న ప్రతి టోర్నీలో ప్రతిభ కనబరిచాడు ప్రకాశ్. కోకో, కబడ్డీ స్టేట్ రెఫరీగా టార్గెట్ బాల్ జాతీయ రెఫరీగా అర్హత సాధించాడు. 2021-22లో యాదాద్రి భువనగిరి జిల్లా జూనియర్ కబడ్డీ జట్టుకు కోచ్‌గా వ్యవహిరించి పలువురి ప్రశంసలందుకున్నాడు.
2019లో జరిగిన జాతీయ టార్గెట్‌బాల్ పోటీల్లో కాంస్యంతో పాటు ఉత్తమ ఆటగాడిగా ఎంపిక అయ్యాడు భాను. 2022లో ఆలిండియా కానోయింగ్, కయాకింగ్ జాతీయ టోర్నమెంటులో సత్తా చాటాడు. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అంతర్జాతీయ టార్గెట్ బాల్ పోటీల్లో రజత పతకంతో మెరిశాడు.
విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిండమే లక్ష్యం - అందుకే 'స్టూడెంట్ ట్రైబ్' రూపకల్పన
ఆటల్లో రాణిస్తూనే ఎన్సీసీ పై దృష్టి సారించాడు ప్రకాశ్. అఖిల భారత స్ధాయి యువ అసోసియేట్ ఎన్‌సీపీ అధికారిగా ఎంపికై, 45 రోజుల శిక్షణ పొందాడు. సాముహిక పరేడ్‌లో ప్రథమ స్థానంలో నిలివడమే గాక, నేవీ విభాగంలో లెఫ్టినెంట్ జనరల్ చేతుల మీదుగా డీజీ కమాండెంట్ సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
"స్కూలింగ్, ఇంటర్ ఇంటికి దగ్గర్లోనే చేశాను. డిప్లోమోలో మంచి టీచర్స్ ఉన్నారు వారు చేసిన సహాయం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో మనం ఎలా ముందుకు రావాలి వారి గైడ్‌లైన్స్‌లో ముందుకు వెళుతున్నాను. 2016లో ఆర్మిలో జాయిన్ అవ్వాలి అనుకున్నాను కానీ మెడికల్‌లో అన్‌ఫిట్‌గా ఉండటం వల్ల నేను ఈ ఫీల్డ్‌కు రావడం జరిగింది. పీజీ అయిన తర్వాత స్కూల్లో ఎన్సీసీ అధికారి కావాల్సి ఉంది అంటే ఇక్కడ వచ్చాను. నా శిక్షణలో ఉన్న ఇద్దరు పిల్లలు రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొన్నారు. అది నాకు గర్వకారణం."- భాను ప్రకాశ్, ఎన్‌సీపీ అధికారి
ప్రస్తుతం ఓ ప్రైవేటు పాఠశాలలో ఎన్‌సీపీ కేర్ టేకర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు ఈ యువకుడు. ఆర్మీలో చేరాలనుకున్న తన కల విద్యార్థుల ద్వారా సాకారం చేసుకోవాలని భావిస్తున్నాడు. విద్యార్థులును త్రివిధ దళాల్లో చేర్చడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నానని భాను ప్రకాశ్ చెబుతున్నాడు.ప్రభుత్వ ఉద్యోగమే అంతిమ లక్ష్యం కాదంటున్నాడు ప్రకాశ్. యువకులు తమ ప్రతిభకు పదును పెట్టాలని సూచిస్తున్నాడు. యువత తమ ఆలోచన విధానాన్ని మార్చుకుని, సైన్యంలో చేరాలని కోరుతున్నాడు.
సజీవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ @ఫొటోగ్రాఫర్ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!
18 Years Handicapped Man Story in Warangal : ఆదుకోండి సర్.. ఉపాధికి దారి చూపించండి..