Revenue Department Special CS orders :ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ శాఖలో దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దని రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాల్లో వెల్లడించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించారు. దీంతో పాటు బదిలీలు, సెలవులపై కూడా నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు వెలువరించారు. మంత్రుల పేషీల్లోని దస్త్రాలను, ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని ఆయా ఓఎస్డీలకు ఆదేశాలు వెలువరించారు.
'ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయొద్దు - నిధుల విడుదల నిలిపేయండి' - Revenue Department Orders - REVENUE DEPARTMENT ORDERS
Revenue Department Special CS orders: ఏపీలోని రెవెన్యూశాఖలో ముఖ్యమైన దస్త్రాలను ప్రాసెస్ చేయవద్దని ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గుత్తేదారులకు నిధుల విడుదల, భూ కేటాయింపు దస్త్రాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పేషీలోని రికార్డులు, దస్త్రాలను జాగ్రత్తపరచాలని సిబ్బందికి సూచన చేశారు.
Revenue Department Special CS orders (ETV Bharat)
Published : Jun 5, 2024, 7:27 PM IST