ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులు ఇవ్వలేదని ఒకరు - మద్యం మత్తులో మరొకరు - తల్లులకు మరణశాసనం - Son Killed Mother Incidents - SON KILLED MOTHER INCIDENTS

Son Killed Mother Incidents : తమ కడుపున పుట్టినా పిల్లలే తమ పాలిట కాలయముడిగా మారుతారని ఆ తల్లులు కలలో కూడా ఊహించి ఉండరు. పెంచి పెద్దచేసినా కనికరం లేకుండా దారుణంగా ఆ మాతృమూర్తులను హతమార్చారు. తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కసాయి పుత్రుల తీరును తెలుపుతుంది.

Son Killed Mother Incidents
Son Killed Mother Incidents (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 11:58 AM IST

Son Brutally Killed Mother Cases in Telangana : అమ్మ అనంత ఆప్యాయతా సాగరం. తీర్చుకోలేని నిస్వార్థ త్యాగాల రుణం. ఆమె లేకుంటే జన్మ లేదు. జీవితానికి వెలుగే లేదు. మాతృత్వం కోసం ఎన్నో కష్టాలు సహించి బిడ్డల్ని ప్రేమగా పెంచి పెద్ద చేస్తుంది. అందుకే మాతృమూర్తిని మించిన దైవం లేదనేది జగమెరిగిన సత్యం. అంతలా తన పిల్లల కోసం ఆరాటపడుతుంది. కానీ నేటి కాలంలో నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలు ఇవేమి పట్టించుకోకుండా మాతృమూర్తులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అవసరమైతే వారి ప్రాణాలు తీసేందుకు వెనుకాడటం లేదు.

తాజాగా తెలంగాణలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. కనిపించిన పిల్లలే తమ పాలిట మరణ శాసనం రాస్తారని ఆ తల్లులు ఊహించలేకపోయారు. తనకు డబ్బులు ఇవ్వలేదని ఓ కుమారుడు, మరో ఘటనలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి వారి మాతృమూర్తులను దారుణంగా హతమార్చి కాటికి పంపారు. ఇందుకు సంబంధించిన ఈ విధంగా ఉన్నాయి.

Son Killed Mother in Mahabubnagar :తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని ఇనుపరాడ్డుతో కొట్టి, గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు ఓ కుమారుడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. గండీడ్‌ మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మ (55)కు రాములుతో 40 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పదేళ్లకు గర్భం దాల్చగా ప్రసవానికి ముందే భర్త అనారోగ్యంతో మరణించాడు. కొన్ని రోజులకు జన్మించిన కుమారుడిని తీసుకొని బతుకుదెరువు కోసం ఆమె ముంబయికి వెళ్లింది.

అక్కడికక్కడే మృతిచెందిన వెెంకటమ్మ : అక్కడే వెంకటమ్మ ఇల్లు నిర్మించుకుంది. కూలి పనులు చేసే కుమారుడు కృష్ణయ్య (30)కు వివాహం కాలేదు. కొన్ని సంవత్సరాల క్రితం తల్లీకుమారులు స్వగ్రామానికి వచ్చి ఇంటిని నిర్మించుకున్నారు. చెడు వ్యసనాలకు లోనైన అతను ముంబయిలోని ఇల్లు విక్రయించగా వచ్చిన డబ్బులు ఇవ్వాలని తల్లిని వేధించేవాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజామున ఇనుపరాడ్డుతో లక్ష్మమ్మ తలపై కొట్టి, గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతిచెందింది.

తర్వాత లక్ష్మమ్మ మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి వేరే వారి ఇంటి ప్రహరీ ముందు పడేశాడు. ఆపై తన తల్లిని ఎవరో చంపేశారని బంధువులకు తెలపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కృష్ణయ్యపై అనుమానంతో విచారించగా నిందితుడు నేరం అంగీకరించాడు.

Son Brutally Killed Mother Nalgonda : నల్గొండ జిల్లా నిడమనూరులో ఒకే ఇంట్లో తల్లీ, ఆమె కుమారుడి మృతదేహాలు రక్తపుమడుగులో పడి ఉండటం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావిరాళ వీరయ్య, సాయమ్మ(65) దంపతులు నిడమనూరులో నివాసం ఉంటున్నారు. వారి ఇద్దరు కుమారులు శ్రీను, శివ(39), ఓ కుమార్తె పద్మ ఉన్నారు. పద్మ కుమార్తె మేఘనను డ్రైవర్‌గా పనిచేస్తున్న శివకు ఇచ్చి పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వారికి పిల్లలు లేరు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో విడిపోయారు.

మేఘనకు శనివారం హైదరాబాద్‌లో మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ పెళ్లికి తన తల్లిదండ్రుల మద్దతు ఉందనే అనుమానంతోపాటు తండ్రి వివాహానికి కూడా వెళ్లాడని శివ కోపం పెంచుకున్నాడు. ఇదే విషయంపై మద్యం మత్తులో ఉన్న అతను శనివారం రాత్రి పొద్దుపోయాక తల్లితో గొడవకు దిగాడు. క్షణికావేశంలో వంటగదిలో వాడే కత్తితో సాయమ్మ గొంతు కోసి, కడుపులో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

రక్తపుమడుగులో తల్లీకుమారుల మృతదేహాలు : అనంతరం గది నుంచి బయటకు వచ్చిన శివ తాను గొంతు కోసుకొని మరణించాడు. వివాహానికి వెళ్లిన తండ్రి వీరయ్య, మిర్యాలగూడలో ఉంటున్న శ్రీను ఇద్దరూ ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. వారు వచ్చి చూసే సరికి సాయమ్మ, శివ విగతజీవులై ఉండటాన్ని చూసి హతాశులయ్యారు. ఈ విషయంపై స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొని పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. బాధితుడు వీరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో హత్య, ఆత్మహత్యగా కేసు నమోదు చేశామన్నారు. మద్యం మత్తులో కొడుకే తల్లిని చంపి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

తల్లిని రోకలిబండతో కొట్టి చంపిన కొడుకు - మతిస్థిమితం లేక దాడి చేశాడన్న తండ్రి - Son Killed his Mother

రైలు ఎక్కిస్తానని నమ్మించి గొంతుకోశాడు - కన్నతల్లిని హతమార్చిన తనయుడు

ABOUT THE AUTHOR

...view details