SANKRANTHI SPECIAL TRAINS : రాష్ట్రంలో అతి పెద్ద పండగ సంక్రాంతి. పండగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. జనవరి 9 నుంచి 12వ తేదీ మధ్య కాచిగూడ - కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - కాచిగూడ, హైదరాబాద్ - కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ - హైదరాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ సదుపాయం జనవరి 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని పేర్కొన్నారు.
- కాచిగూడ - కాకినాడ టౌన్ ట్రైన్ (07653) జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. అలాగే కాకినాడ టౌన్ - కాచిగూడ రైలు (07654) ఈ నెల 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 4.30 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి.
- హైదరాబాద్ -కాకినాడ పట్టణం రైలు (07023) జనవరి 10వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు (07024) జనవరి 11వ తేదీన రాత్రి 8గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.
SCR to run Sankranti Special Trains @drmsecunderabad @drmgnt pic.twitter.com/agqBjEEExA
— South Central Railway (@SCRailwayIndia) January 1, 2025
అటెన్షన్ ఆల్ - పలు రైళ్ల టైమింగ్లో మార్పులు
పర్యాటకులకు పండగే - అరకు సందర్శకులకు ప్రత్యేక రైళ్లు
గుడ్న్యూస్ - శబరిమలకు 28 ప్రత్యేక రైళ్లు - రేపటి నుంచే బుకింగ్