Tourists in Sangam Barrage : నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నానదిలో బీరాపేరు, బొగ్గేరు వాగులు సంగమించే సంగమ స్థానం జలసౌందర్యానికి నిలయంగా ఉంది. ఇక్కడి సాగునీటి పరవళ్లను కనులారా తిలకించి ప్రజలు ఆనందిస్తుంటారు. బ్యారేజి నిర్మాణం తరువాత పర్యటకుల సంఖ్య భారీగా పెరింది. దుష్టసంహారం కోసం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సును 'పినాక' అంటారు.
కర్ణాటక రాష్ట్రంలో నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది శివుడి విల్లు 'పినాక' ఆకారంలో ఉండటంతో దాన్ని పెన్నానది అని పిలుస్తున్నారు. దానిలో సంగం వద్ద బీరాపేరు, బొగ్గేరు అనే రెండు వాగులు సంగమిస్తుంటాయి. దాంతో ఈ సంగమ స్థానం కాలక్రమేణా సంగంగా మారింది.
పురాతనమైన ఆనకట్ట: పెన్నానది జలాలను వృథాగా సముద్రంలో కలవకుండా సద్వినియోగం చేసేందుకు 1882-85 మధ్య కాలంలో సంగం వద్ద పెన్నానదికి అడ్డుగా 1242 మీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మించారు. దక్షిణాసియా ఖండంలో ఇప్పటికీ అదే అత్యంత పురాతనమైన జలవనరుల కట్టడంగా పేరు పొంది ప్రస్తుతం నీటిలో మునిగింది.
దిగువన ప్రత్యేకం: సాధారణంగా పురాతన కట్టడానికి ఎగువ భాగంలో నూతన నిర్మాణం చేస్తారు. సంగంలో మాత్రం విభిన్నంగా సంగం ఆనకట్టకు దిగువన 450 మీటర్ల దూరంలో 1200 మీటర్ల పొడవైన బ్యారేజి నిర్మాణం జరగడం విశేషం. అనుబంధంగా కనిగిరి జలాశయం ప్రధాన కాలువ, కనుపూరు, నెల్లూరు చెరువు, దువ్వూరు, బెజవాడ పాపిరెడ్డి కాలువలున్నాయి.
రహదారులు ఆభరణాలుగా: నెల్లూరు-ముంబయి జాతీయ రహదారి, సంగం- కలిగిరి రహదారులను ఆభరణాలుగా కలిగిన సంగం కొండ పచ్చదనంతో కళకళలాడుతూ అత్యంత సుందరంగా ప్రయాణికులను, ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
జిల్లా కేంద్రానికి సమీపంలో: జిల్లా కేంద్రానికి 32 కి.మీ దూరంలోనే సంగం బ్యారేజి ఉంది. నెల్లూరు ముంబయి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. తిరుమల, తిరుపతికి వెళ్లేందుకు దగ్గర దారిగా, జాతీయ రహదారికి ప్రత్యామ్నాయ రహదారి వసతి బ్యారేజిపై వంతెన ద్వారా లభించింది.
250 ఎకరాల్లో నీటి నిల్వ: బ్యారేజి, ఆనకట్ట మధ్య సుమారు 250 ఎకరాలకు పైగా నీటి నిల్వతో జలనిధి ఉంది. అత్యంత సమీపంలో తిలకించేందుకు వీలుగా రహదారులు, పొర్లుకట్ట ఉండటంతో సందర్శకులు విరివిగా వస్తున్నారు.
పచ్చదనంతో: బ్యారేజి వద్ద పచ్చదనంతో శోభాయమానంగా సేద తీరేందుకు ఉల్లాసభరితంగా, మినీ పార్కు సుందరంగా ఆకట్టుకుంటుంది.
గాల్లో తేలియాడుతూ భూమిపై అందాలను చూసేయ్ - విశాఖలో ‘స్కై సైక్లింగ్’
రంగు రంగుల లైట్ల వెలుతురులో.. పర్యాటకులను మైమరిపిస్తున్న కొత్తపల్లి జలపాతం