తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బులిస్తారా చస్తారా? - బట్టలు విప్పదీసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి - విద్యార్థులపై ఆకతాయిల దాడులు - ATTACK ON STUDENTS FOR MONEY IN AP - ATTACK ON STUDENTS FOR MONEY IN AP

Attack On Students for Money in AP : విద్యార్థులపై ఆకతాయిలు దాడి చేసిన సంఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటికి వెళ్తున్న విద్యార్థిని అడ్డగించి డబ్బులు ఇవ్వాలని ఆకతాయిలు డిమాండ్​ చేశారు. తన వద్ద లేదని విద్యార్థి చెప్పడంతో అతన్ని విచక్షణారహితంగా కొట్టారు.

Attack On Students
Attack On Students (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 1:54 PM IST

Attack On Students for Money in Nandyal :ఏపీలోనినంద్యాల పట్టణ శివారులోని ఎస్‌డీఆర్‌ పాఠశాల సమీపంలో కొందరు ఆకతాయిలు ఇద్దరు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు కథనం ప్రకారం, ఆగస్టు 1న ఎస్‌డీఆర్‌ పాఠశాల ఛైర్మన్‌ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం బైక్​పై ఇంటికి వెళ్తున్న ఓ ఇంటర్‌ విద్యార్థిని సుబ్బయ్య, శంకర్, మరికొంత మంది అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Attack On Students (ETV Bharat)

దుస్తులు విప్పదీసి ఈడ్చుకెళ్లి.. తన వద్ద డబ్బు లేదని విద్యార్థి చెప్పాడు. దీంతో అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆ విద్యార్థి తనకు తెలిసిన బీటెక్‌ విద్యార్థి లోకేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేశాడు. జరిగిందంతా అతనికి వివరించాడు. దీంతో అతను వెంటనే అక్కడికి రాగా, ‘డబ్బులు ఇవ్వాలని అడిగితే నువ్వెందుకు వచ్చావ్‌’ అంటూ దుండగులు లోకేశ్వర్‌రెడ్డి పైనా దాడికి పాల్పడ్డారు. దుస్తులు విప్పదీసి రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో పాటు ఛాతీపై కూర్చొని కొట్టారు. అతని చెవి కొరికి తీవ్రంగా గాయపరిచారు. ఈ వీడియో ఆదివారం (ఆగస్టు 4న) సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది.

ఆస్తి కోసం కన్నబిడ్డను కడతేర్చిన తండ్రి - హత్యలో అన్నదమ్ముల హస్తం

ఈ సంఘటన జరిగిన రోజు నుంచి లోకేశ్వర్​రెడ్డి పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కనీసం కేసు పెట్టలేదంటూ బాధితుడు వాపోతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేశారు. ఈ దారుణం పాఠశాల సమీపంలో జరగ్గా, స్కూలు యాజమాన్యమే కేసు నమోదు కాకుండా అడ్డుకుందనే ఆరోపణలు స్థానికులు నుంచి వస్తున్నాయి. నిందితులు సుబ్బయ్య, శంకర్, మరికొందరిపై ఆదివారం (ఆగస్టు 4న) కేసు నమోదు చేసినట్లు నంద్యాల గ్రామీణ సీఐ దస్తగిరిబాబు తెలిపారు.

Father killed his daughter at Chandanagar : భార్యపై కోపం.. సొంత కుమార్తెను బ్లేడ్​తో కోసి హత్య చేసిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details