Attack on Students for Money in Nandyal :నంద్యాల పట్టణ శివారులోని ఎస్‌డీఆర్ పాఠశాల (SDR-Special Drawing Rights) సమీపంలో కొందరు ఆకతాయిలు ఇద్దరు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు కథనం ప్రకారం, ఆగస్టు 1న ఎస్‌డీఆర్ పాఠశాల ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం బైక్‌పై ఇంటికి వెళ్తున్న ఓ ఇంటర్ విద్యార్థిని సుబ్బయ్య, శంకర్, మరికొంత మంది అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన వద్ద డబ్బు లేదని విద్యార్థి చెప్పాడు. దీంతో అతన్ని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో ఆ విద్యార్థి తనకు తెలిసిన బీటెక్ విద్యార్థి లోకేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేశాడు. జరిగిందంతా అతనికి వివరించాడు. దీంతో అతను వెంటనే అక్కడికి రాగా, ‘డబ్బులు ఇవ్వాలని అడిగితే నువ్వెందుకు వచ్చావ్’ అంటూ దుండగులు లోకేశ్వర్‌రెడ్డి పైనా దాడికి పాల్పడ్డారు. దుస్తులు విప్పదీసి రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో పాటు ఛాతీపై కూర్చొని కొట్టారు. అతని చెవి కొరికి తీవ్రంగా గాయపరిచారు. ఈ వీడియో ఆదివారం (ఆగస్టు 4న) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
రూ.200 కోసం గొడవ - రూ.2 కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణం - A Young Man Died in Fight Over 200