ETV Bharat / state

అడవుల్లో జంతువులను ఎలా లెక్కిస్తారో తెలుసా? - 98% మంది కన్ఫ్యూజ్ - FOREST ANIMAL CENSUS 2025

మార్కాపురం డివిజన్ పరిధిలో వన్య ప్రాణుల గణన - ప్రస్తుతం 40 పులులు

forest_animal_census_2025
forest_animal_census_2025 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 18 hours ago

Forest animal census 2025 : జనాభా లెక్కలు అంటే ఎన్యూమరేటర్లు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆయా ఇళ్లలో నివాసం ఉండే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకుంటారు. తద్వారా వార్డు, గ్రామ, మండల జనాభా ఎంతనేది తేలుస్తారు. మరి అడవిలో ఉండే జంతువులను గణించడం ఎలా అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా మీకు? 98శాతం మంది ఈ విషయంలో సరైన సమాధానం చెప్పలేకపోయారు. అడవిలో పులులు, జంతు గణన ఎలా అంచనా వేస్తారో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

పులితో లైవ్ ఫొటో తీసుకుంటారా? - పది రోజుల్లో రెండు పెద్దపులులు

జన గణన సందర్భంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నమోదు చేసుకుని మొత్తం జనాభా లెక్కలు తేలుస్తారు. అయితే అడవిలో జంతు జనాభాను లెక్కించడానికీ ఓ పద్ధతి ఉంది. జనాభా లెక్కల అంత ఈజీ పద్ధతేం కాదు. అడవిలో ఉండే జంతువులు కొన్ని బొరియల్లో, కొన్ని చెట్ల కొమ్మలపై, మరికొన్ని అక్కడక్కడా సంచరిస్తుంటాయి. ఇలాంటి వాటిని వెతికి పట్టుకోవడం అసాధ్యం. ఒక వేళ వాటిని గుర్తించినా విశాలమైన దండకారణ్యంలో సంచరించే వాటిని వెతికి పట్టుకోవడం అత్యంత కష్టమైన పని. అయినప్పటికీ దట్టమైన నల్లమలలో సంచరించే పెద్ద పులలు, పులులు, చిరుతలు సంఖ్య తెలిసిపోతుంది. కృష్ణ జింకలు, దుప్పులు, నక్కలు, అడవి కుక్కలు, కుందేళ్లు, అడవి కోళ్లు, మనుబోతులు, ఎలుగుబంట్ల సంఖ్య కూడా అటవీ అధికారులు అధికారులు చెబుతుంటారు. అటవీ జంతువులను వీటిని ఎలా గణిస్తారో తెలుసుకుందాం.

అటవీ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కాపురం డివిజన్‌ పరిధిలో జంతు గణన ప్రారంభించారు. మొత్తం 40 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా పులులు, చిరుతలను లెక్కించనున్నారు. రెండో దశలో శాఖాహార జంతువులు, చివరిగా మాంసాహార జంతువుల గణన చేపట్టనున్నట్లు మార్కాపురం అటవీ శాఖ డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి.సందీప్‌ కృపాకర్‌ తెలిపారు. జంతు గణన పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు చెప్పారు.

పెంటికలు, గుంతలు, గీతల ఆధారంగా లెక్కింపు :

శాఖాహార జంతువులు గడ్డి, చెట్ల ఆకులు ఆహారంగా తీసుకుంటాయి. అటవీ సిబ్బంది స్వయంగా నడిచుకుంటూ వెళ్లి పరోక్ష పద్ధతిలో వీటిని లెక్కిస్తారు. పెంటికలు (మలం), చెట్లపై కనిపించే గోళ్ల గీతలు, ప్రత్యేకంగా విడిచే జాడలు, భూమిలో తీసే గుంతలు వంటి ఆధారాలతో లెక్కిస్తారు. అందుకుగాను ప్రతి రెండు కిలో మీటర్లకు ఓ బృందం పని చేస్తుంది.

మాంసాహార జంతువుల గణనకు ప్రతి 5 కిలో మీటర్లకు ఒక బృందం ప్రత్యేకంగా పనిచేస్తుంది. వీరు దట్టమైన అటవిలో సంచరిస్తూ తారస పడిన జంతువులను లెక్కిస్తారు. పెంటికలు, జంతువులు వదిలి వెళ్లిన జాడలు (కాలి ముద్రలు), చెట్లపై గోళ్ల గీతలు, ఘర్షణ సమయంలో ఏర్పడిన అడుగులు పరిగణిస్తారు. అదేవిధంగా శరీరం మొత్తం భూమిపై పడినప్పుడు వాటి అచ్చులు వంటి ఆధారాలు సేకరించి భారతీయ వన్యప్రాణి సంస్థకు పంపుతారు. అక్కడ పరిశీలించి ఏ రకం జంతువులు ఎన్ననేది లెక్క తేల్చి నివేదిక రూపొందిస్తారు.

మచ్చలు, చారలు కీలక ఆధారం :

  • ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్​లో నల్లమల 2.40 వేల హెక్టార్లలో విస్తరించి ఉంది.
  • జిల్లా అంతటా 40 రోజుల పాటు పులుల గణన చేపట్టనున్నారు.
  • జంతు గణన కోసం ప్రత్యేకంగా ప్రతి రెండు కిలో మీటర్లకు రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
  • అటవీ ప్రాతంలో గుర్తించిన కీలకమైన 431 ప్రాంతాల్లో మొత్తం 862 ట్రాప్ కెమెరాను ఎదురెదురుగా అమరుస్తారు.
  • ట్రాప్ కెమెరాలో నమోదైన చిత్రాలను నిపుణులకు పంపిస్తారు. ఫుటేజీ ఆధారంగా పూర్తి స్థాయిలో పరిశీలించి పెద్దపులులు, చిరుతల లెక్క తేలుస్తారు.
  • మార్కాపురం అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య ప్రస్తుతం 40 వరకు ఉంటుందని అధికారులు గుర్తించారు.
  • పులుల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా అనేది తాజాగా చేపట్టిన గణనలో తేలనుంది.
  • జంతు గణనలో పులులు, చిరుతల చర్మంపై మచ్చలు ఎంతో కీలకం. ఏ ఒక్క దానికి ఒకే తరహా మచ్చలు, చారలు కాకుండా భిన్నంగా ఉంటాయని అటవీ అధికారులు వెల్లడించారు. మచ్చల ఆధారంగా లెక్క తేల్చనున్నట్లు తెలిపారు.

21రోజుల్లో 3రాష్ట్రాలు, 300 కి.మీ జర్నీ- ఎట్టకేలకు చిక్కిన ఆడపులి 'జీనత్​'

"అదిగో పెద్దపులి.. ఇదిగో చిరుత" - మూడు జిల్లాల ప్రజల్లో భయాందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.