రాయచోటిలో పేలిన గ్యాస్ సిలిండర్ - ముగ్గురు సజీవ దహనం (ETV Bharat) Gas Cylinder Blast in Annamayya District :అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తల్లి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రాయచోటిలో తల్లి, కుమారుడు, కుమార్తె వారు ఉంటున్న ఇంట్లోనే సజీవ దహనం అయ్యారు. రమాదేవి అనే మహిళ తొగటవీధిలో పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె భర్త జీవనోపాధి కోసం కువైట్ వెళ్లారు.
ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు వస్తుండటాన్ని స్థానికులు గుర్తించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో తలుపులు తెరుచుకోలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఇంట్లో వెళ్లి చూడగా అప్పటికే రమాదేవీ, తొమ్మిదేళ్ల కుమారుడు మనోహర్, ఐదేళ్ల మాన్విత మంటల్లో చిక్కుకుని చనిపోయారు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కారుకు పూజ చేయించుకుని వెళ్తుండగా ఎదురొచ్చిన మృత్యువు- ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు - Accident To Two Cars
గ్యాస్ సిలిండర్ లీకేజ్ కావడం వల్లే మంటలు చెలరేగి చనిపోయారా? లేక వారే పెట్రోల్ లేదా కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కువైట్‌లో ఉన్న భర్త రమాదేవిని ఎప్పుడు అనుమానిస్తుండే వాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మృతురాలి రమాదేవిపై అనుమానంతో ఇంటి బయట, బెడ్ రూమ్, వంట గదిలో కూడా సీసీ కెమెరాలు అమర్చినట్సు కుటుంబసభ్యులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఆ గొడవ కారణంగానే రమాదేవి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్థానికులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రాయచోటి డీఎస్పీ రామచంద్ర తెలిపారు.
రాయచోటిలోని ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు కారణాలను వెలికితీయాలని బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు త్వరితగతిన పూర్తి చేసుకోవాలే తప్ప ఇలాంటి చర్యలకు పాల్పడితే చాలా బాధకరమని మంత్రి అన్నారు. ఈ ఘటనపై అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇంటిలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించి నిజనిజాలు తెలుసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమాదేవి బంధువులతో పాటు మరి కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు
'తండ్రి చూస్తుండగానే చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్'- 'ఆడుకుంటూ రోడ్డెక్కిన బాలుడు అక్కడికక్కడే' - Accidents in AP