ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా అధికారుల చర్యలు - అడిగింది ఒకటైతే సమాధానం మరొకటి ఎందుకని ప్రశ్న - AP ASSEMBLY SESSION 2024

Some Officials Trying to Topple New Ministers: కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదే విషయంపై అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది.

New Ministers Vs Officials
New Ministers Vs Officials (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 11:51 AM IST

Updated : Jul 24, 2024, 12:11 PM IST

Some Officials Trying to Topple New Ministers: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలను వెలికి తీస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి లోనవుతున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చించుకుంటున్నారు.

గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై ఉపముఖ్యమంత్రి పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లేకుండా అవును, కాదు, ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానమివ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను పవన్ ఆదేశించారు.

అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారమిచ్చారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్​ ప్లాన్​ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిస్థాయి సమాచారం లేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వం రాజకీయ అవసరాలకే పోలీసులను వాడుకుంది: హోంమంత్రి అనిత - Home Minister On Police In Assembly

Last Updated : Jul 24, 2024, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details