Snake Appeared in Shiva Temple on Shivaratri :మహాశివరాత్రి వేళ రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శంభో శంకర అంటూ ముక్కంటిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఆలయంలో నాగుపాము దర్శనం :మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓదెల శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది. గతంలోనూ ఈ ఆలయంలో నాగుపాము దర్శనమివ్వగా తాజాగా మహాశివరాత్రి పర్వదినం నాడు మరోసారి నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో ఇదంతా దేవుడి మహిమేనని భక్తులు భావిస్తున్నారు. నాగదేవత విగ్రహం వద్ద చాలాసేపు నాగుపాము ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగుపామును దర్శించుకున్నారు
Shiva Art On Leaf :మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ భక్తులకు వినూత్నంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రావి ఆకుపై ఆ మహాశివుని ప్రతిమను గీసి అరచేతిలో, చేతి గోళ్ళపై శివుని అలంకారాలు, విగ్రహ ప్రతిమలను వేసి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కంటి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. MLC కల్వకుంట్ల కవిత రాజన్నను దర్శించుకున్నారు.