Sivarathri Celebrations at Kotappa Konda: రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. శ్రీ త్రికోటేశ్వరస్వామి (Trikoteshwara Swamy) ఆలయంలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటలకు స్వామి వారికి తొలిపూజలో భాగంగా బిందెతీర్ధంతో మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. త్రికోటేశ్వరునికి నిర్వహించే తొలిపూజ వేడుకను తిలకించేందుకు భక్తులుశుక్రవారం రాత్రి నుండే ఆలయంలో బారులు తీరారు.
కోటప్పకొండకు భారీగా తరలివచ్చిన భక్తులు...
Sivarathri Arrangements In Kotappa konda: మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే తిరునాళ్లకుకోటప్పకొండ ముస్తాబైంది. కొండ విద్యుత్ దీపాల (Electric lights) వెలుగులో మెరిసిపోతుంది. కొండ దిగువన బొచ్చుకోటయ్య స్వామి, సిద్ధివినాయక, రాజగోపురం, స్వామి వారి ఆలయం, యాగశాల, నవగ్రహ మండపం, పుట్ట, ధ్యాన మందిరం, అతిథి గృహాలు, క్యూకాంప్లెక్స్ తదితరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కొండకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం (District Administration) అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. భక్తులకు సేవల నిమిత్తం ఎక్కడికక్కడే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయనున్నారు. కొండ చుట్టూ వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.
పిలుస్తోంది కోటప్పకొండ
కోటప్పకొండపై ఏర్పాట్లు:కొండపై యాగశాలలో ఒకేసారి 50కు పైగా హోమాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. పంచాయతీరాజ్ శాఖ వారి సాయంతో స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని తాగునీటితో పాటు, అల్పాహార ఏర్పాట్లు చేశారు. కలెక్టర్, ఎస్పీ అతిథి గృహాల్లో కొండపైనే బస చేసి, భక్తుల సౌకర్యాలను పరిశీలించనున్నారు. సామాన్య భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచే కొండపైకి బస్సు సౌకర్యం కల్పించారు. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.