SIT Investigation on Adulterated Ghee in Thirumala :తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్ర స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు నేరుగా సరఫరా చేసిందా? లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా? అనేది పరిశీలన చేస్తోంది. ఇప్పటికే ఏఆర్ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను పరిశీలించి వచ్చిన సిట్ అధికారులు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.
తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ
టెండరు సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలు ఏమిటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాల్నీ సరిచూస్తున్నారు. నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని టీటీడీ నిర్ణయించింది, ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరి చూశారు. ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకు సరఫరా చేస్తుందన్న విషయమై కూడా అధికారులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్ ల్యాబ్ ధ్రువీకరించిందని ఏఆర్ డెయిరీ పేర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీజ్ చేసిన దస్త్రాలను తిరుపతి కోర్టులో సమర్పించారు.