ETV Bharat / state

శ్రీహరికోట వేదికగా సెంచరీ కొట్టిన ISRO - GSLV- F15 సక్సెస్ - ISRO 100TH ROCKET LAUNCH SUCCESS

శ్రీహరి కోట వేదికగా ఇస్రో వందో ప్రయోగం విజయవంతం - నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15

ISRO 100th Rocket Launch Success
ISRO 100th Rocket Launch Success (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 8:33 AM IST

ISRO 100th Rocket Launch Success : శ్రీహరికోట వేదికగా ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది. షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్‌ ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. ఇది కొత్తతరం నావిగేషన్‌ ఉపగ్రహాల్లో రెండోది.

ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది తొలి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్‌ పరికరాల్లో లోకేషన్‌ ఆధారిత సేవలను అందించనుంది.

ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది : ఇస్రో శాస్త్రవేత్తలకు ఛైర్మన్‌ నారాయణన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్‌ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. శ్రీహరి కోట వేదికగా ఈ వందో ప్రయోగం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని వివరించారు. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుందని అన్నారు. విక్రమ్‌ సారాబాయ్‌ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగిందని ఆయన గుర్తుచేశారు.

ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్‌ వెహికిల్స్‌ అభివృద్ధి చేశామని నారాయణన్ వివరించారు. 1979లో అబ్దుల్‌ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయని అన్నారు. వంద ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపామని తెలిపారు. 3 చంద్రయాన్‌, మాస్‌ ఆర్బిటర్‌, ఆదిత్య, ఎస్‌ఆర్‌ఈ మిషన్లు చేపట్టామని నారాయణన్‌ వెల్లడించారు.

"ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతం. నావిగేషన్‌ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది. విక్రమ్‌సారాబాయ్‌ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగింది. ఇప్పటివరకు 6 జనరేషన్ల లాంచ్‌ వెహికిల్స్‌ అభివృద్ధి చేశాం. ఇప్పటివరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు." - నారాయణన్‌, ఇస్రో ఛైర్మన్

స్పేడెక్స్‌ ప్రయోగం - పీఎస్ఎల్వీ సీ-60 విజయవంతం

ప్రోబా-3 మిషన్ సక్సెస్- నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ59

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.