SIB Ex DSP Praneeth Rao Case Update : ఆధారాల ధ్వంసం కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రణీత్‌రావు తరఫు న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. కాగా ఈ విషయంపై శుక్రవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. ప్రణీత్‌రావు(Ex DSP Praneeth Case)ను కస్టడీలోకి తీసుకుంటే ఆధారాల ధ్వంసంపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు దర్యాప్తు బృందం నిందితుడు ఎంత మంది కాల్ డీటెయిల్ రికార్డును సేకరించాడు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Phone Tapping Case Hyderabad :అయితేఎఫ్ఐఆర్లో కూడా నిందితుల జాబితాలో ప్రణీత్‌తో పాటు మరికొందరు అని మాత్రమే నమోదు చేశారు. ప్రస్తుతం వారెవరో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రణీత్(Phone Tapping Case) ఉపయోగించిన రెండు గదులు, 17 కంప్యూటర్లను పరిశీలించింది. కాగా అతను ఎవరెవరి సీడీఆర్, ఐఎంఈఐ, ఐపీడీఆర్ డేటాను సేకరించాడు, ఎవరి ఆదేశాల మేరకు సేకరించాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో అతని ఆధీనంలో పని చేసిన ఎస్ఓటీ సిబ్బందిని కూడా నిందితులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు