Shoulder Helmet Designed by Hyderabadi Phani Kumar :పట్టణీకరణలో భాగంగా వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఎక్కువగా ద్విచక్ర వాహనాలే రోడ్లపై రాజ్యమేలుతున్నాయి. కానీ, వాటిని నడిపేవారు మాత్రం భద్రత ప్రమాణాలను పాటించడం లేదు. జుట్టు రాలిపోతుందనే భయంతో హెల్మెట్ ధరించడం లేదు. అలాంటి అపోహకు చెక్ పెడుతూ షోల్డర్ సపోర్ట్ హెల్మెట్ తయారు చేశాడు ఓ యువకుడు. అతని పేరు ఫణి కుమార్. గుంటూర్ జిల్లా, వేల్పూర్ స్వస్థలం. భీమవరంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చాడు. 2 సంవత్సరాల పాటు నాట్కో ఫార్మా కంపెనీలో ఈహెచ్ఎస్గా పనిచేశాడు. ఆ తరువాత జేఎన్టీయూ కళాశాలలో పర్యావరణ శాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేశాడు.
ఈ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు రాలిపోదు : నగరాల్లో బైక్ నడిపేవారు హెల్మెట్లు ధరించకపోవడాన్ని గమనించాడు ఫణికుమార్. జుట్టు రాలిపోతుందనే భయమే అందుకు కారణమని తెలుసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారించే దిశగా అడుగులేయాలని సంకల్పించాడు. అలా బైక్ ప్రయాణంలో ఉపకరించేలా 6 నెలలు కష్టపడి షోల్టర్ సపోర్ట్ హెల్మట్ తయారు చేశాడు ఫణి కుమార్. దీంతో పాటు మెడచుట్టూ వీల్ పెట్టుకునే హెల్మెట్ కూడా తయారు చేసినట్లు వివరిస్తున్నాడు. ఈ హెల్మెట్ టీఎస్ఐసీ హైదరాబాద్ నుంచి బెస్ట్ ఇన్నోవేషన్‌గా ఎంపికైనట్లు చెబుతున్నాడు ఫణి. ప్రస్తుతం టీ వర్క్ సహకారంతో తది మెరుగులు దిద్దుతున్నట్లు వివరిస్తున్నాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసి జువ్వా ఇండస్ట్రీస్ అనే స్టార్టప్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నాడీ ఇన్నోవేటర్.
యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు