మోసగాళ్లకు మోసగాడు - ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ రూ.3.40 లక్షలు వసూలు Sheep Distribution Scam Updated : మహబూబ్‌నగర్ జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లేష్ విలాసాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో అడ్డదారుల్ని ఎంచుకున్నాడు. ఆ క్రమంలోనే మరో నిందితుడు రాపోలు అనిల్ కుమార్‌తో జతకట్టాడు. సులభంగా డబ్బు ఎలా సంపాదించవచ్చని ఆలోచించారు. అప్పుడే ఏసీబీ ఇన్‌స్పెక్టర్ పేరిట ప్రజలతో సహా అధికారులను బురిడీ కొట్టించాలని పథకం పన్నారు. తగ్గట్టుగానే కార్యచరణ రూపొందించి అమలు చేశారు.
గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో విచారణ ముమ్మరం - మరో అధికారి ప్రమేయం గుర్తించిన ఏసీబీ
Fake ACB Arrest : మల్లేశ్ అలియాస్ మూర్తి గతంలో పనిచేసిన ఆర్‌ఐ నుంచే బెదిరింపులకు పాల్పడి రూ. 65 వేల రూపాయలు కాజేశాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్‌లో కీలక నిందితుడుగా ఉన్న అంజిలప్పనే బురిడీ కొట్టించాడు. అతన్ని బెదిరించి లక్ష రూపాయలు వసూలు చేశాడు. మోసాలు చేసిన వారినే మోసం చేస్తూ మోసగాళ్లకు మోసగాడిలా తయారయ్యాడు. ఇలా ఒకటా రెండా ఇద్దరు నిందితులు కలిసి 8 మంది నుంచి దాదాపుగా రూ. 3 లక్షల 40వేల రూపాయలు కాజేశారు.
ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ కొందరికి బెదిరింపు కాల్స్ : అమాయకులతో సహా పలువురిని లక్ష్యంగా చేసుకుని ముందు ఫోన్ చేస్తారు. మీ ఇంట్లో త్వరలో ఏసీబీ తనిఖీలు జరుగుతాయని, తమవద్ద ఉన్న కచ్చితమైన సమాచారంతో చెబుతున్నామని బెదిరిస్తారు. ఈ ఫోన్‌కాల్ వచ్చినట్లుగా ఎవరికీ చెప్పవద్దంటూ బాధితులను బెదిరించి అందినకాడికి దోచేస్తారు. ఈ అక్రమ దందాలు సాగుతున్న క్రమంలోనే హైదరాబాద్ కొత్తపేటకు చెందిన సుధీర్‌బాబు నుంచి కూడా డబ్బు వసూలు చేసేందుకు పథకం పన్నారు.
లక్ష నుంచి రూ.2 లక్షల రూపాయల వరకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన బాధితుడు ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సాధారణ పౌరులు అంటే భయపడ్డారనుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా డబ్బులు చెల్లించడం విస్మయానికి గురిచేస్తోంది.
గొర్రెల పంపిణీ కేసులో ఉద్యోగుల పాత్ర బట్టబయలు - బినామీల పేర్లతో నిధుల మళ్లింపు
చేపలు, గొర్రెల పంపిణీపై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం