Several Road accidents in AP : రాష్ట్రంలో సోమవారం జరిగిన పలు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, కర్ణాటకలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రాష్ట్ర వాసులు ప్రాణాలు కోల్పోయారు.
Kakinada Prathipadu Road Accident: కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ వెనక టైర్ పంచర్ వేస్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టగా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రం నుంచి విశాఖకు ఓ లారి బయల్దేరింది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు సమీపంలోకి రాగానే వెనక టైర్ పంచరైంది.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు మృతి
గమనించిన డ్రైవర్ లారీని ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన నిలిపివేశాడు. టైరుకు పంక్చర్ వేస్తుండగా, ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పంచర్ వేస్తున్న వ్యక్తులతో పాటు స్థానికుడు ఒకర్ని ఢీ కొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గమనించిన ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో, ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారిలో ముగ్గురు బాపట్ల జిల్లా నక్క బొక్కల పాలెం గ్రామానికి చెందిన వారైన దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, క్లినర్ నాగయ్య కాగా, స్థానికుడు రాజు అని పోలీసులు వెల్లడించారు.
టైరు పేలి బొలెరో వాహనం బోల్తా - 17 మంది కూలీలకు గాయాలు
కూలీల బొలెరో బోల్తా: అనంతపురం జిల్లాలో 40మంది కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడింది. దీంతో 40మందికి గాయాలు కాగా, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. వారిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వజ్రకరూరు నుంచి పాల్తూరుకు మిర్చి తోటలో పనిచేయడానికి కూలీలు బొలెరో వాహనంలో బయల్దేరారు. వీరు ఉరవకొండ సమీపానికి చేరుకోగానే వీరి వాహనం వెనక టైరు పేలి వాహనం అదుపు తప్పి బొల్తా పడింది.