Several People Died in Road Accidents Across the State:చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మొగిలి ఘాట్‌లో 2 లారీలు రాపిడికి గురై అగ్గిరాజుకుంది. అవి డీజిల్ ట్యాంకర్‌కు అంటుకుని పెద్ద మంటలు చెలరేగాయి. యూకలిప్టస్ లోడుతో వెళ్తున్న లారీ బ్రేక్ విఫలం కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. అదే సమయంలో భద్రాచలం వెళ్తున్న చక్కెర లోడు లారీ ఆగి ఉన్న లారీని రాసుకుంటూ వెళ్లింది. ఆ రాపిడిలో నిప్పురవ్వులు చెరలేగాయి. అదే సమయంలో ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంకర్ పగిలిపోయింది. ఈ ప్రమాదంలో ఆగిఉన్న లారీలో క్లీనర్ కార్తీక్(23) దుర్మరణం పాలయ్యాడు. మృతుడు ఎన్టీఆర్ జిల్లా వెంకటాపురం వాసిగా గుర్తించారు. చక్కెర లోడు బోల్తా పడటంతో లారీ డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి.
రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూకలిప్టస్ లారీ దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చక్కెర లారీ క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఆగి ఉన్న పోలీస్ బొలెరో వాహనాన్ని తప్పించబోయి మరో లారీ ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. వరుస ప్రమాదాలతో మొగిలి ఘాట్ రోడ్డు బెంబేలెత్తిస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇది మూడో ప్రమాదం కావడం తో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.
తిరుమల లడ్డూ వివాదం - వైరల్ అవుతున్న ప్రకాష్‌రాజ్ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan