తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తు కోసం విపరీత రద్దీ - నాణ్యమైన విత్తనాల కోసం ఎగబడ్డ సాగుదారులు - Seed Mela in jagtial

Seed Mela 2024 : జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో నిర్వహించిన విత్తన మేళాకు అన్నదాతల నుంచి అపూర్వ స్పందన లభించింది. మేలైన వరి వంగడాలు అందుతాయనే ఉద్దేశంతో కర్షకులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యంగా ఉంటాయని వాటి కోసం పోటీపడ్డారు. అందరికీ అందించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు ఒక బస్తానే ఇవ్వడంపై సాగుదారులు పెదవి విరుస్తున్నారు.

Seed Mela for Farmers in Telangana
Seed Mela 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:43 PM IST

విత్తు కోసం విపరీత రద్దీ - నాణ్యమైన విత్తనాల కోసం ఎగబడ్డ సాగుదారులు (ETV Bharat)

Seed Mela for Farmers in Telangana :వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమవుతున్నారు. అధిక దిగుబడుల కోసం మేలైన వంగడాలు సేకరించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి తరుణంలో జయశంకర్‌ విశ్వవిద్యాలయం అనుబంధ జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ పరిశోధన స్థానంలో విత్తనమేళా నిర్వహించారు.

కరీంగనర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చి వరుసకట్టారు. ఫౌండేషన్‌ బ్రీడ్‌ కావటం, విత్తనాల నాణ్యత దృష్ట్యా కర్షకులు వాటిని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వటంపై గంపెడాశతో వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. బస్తా ఎకరానికి మాత్రమే సరిపోతాయని కనీసం రెండు బస్తాలిస్తే బాగుంటుందని అన్నదాత కోరుతున్నారు.

'ప్రభుత్వం బ్రీడ్‌ వంటి నాణ్యమైన విత్తనాలు తయారు చేస్తోంది. ప్రైవేట్​లో నకిలీ విత్తనాలు ఉంటున్నాయి. ఇలా రైతులకు అవగాహన కల్పిస్తూ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలి. పరిశోధన కేంద్రం, శాస్త్రవేత్తలు, రైతలు కలిసి విత్తనోత్పత్తి చేస్తే తక్కువ ధరలో విత్తనాలు అందుబాటులో ఉంటాయి. రైతులకు అధిక దిగుబడి వచ్చేలా పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తలు విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను భవిష్యత్తులో కూడా ఉపయోగించవచ్చు'- రైతులు

మూడు నాలుగు పంటలకు సరిపడేలా : విత్తనాలు కొద్దిమొత్తంలో ఉండటం ఎక్కువ మంది వాటి కోసం రావడం వల్ల ఒక బస్తా మాత్రమే ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే విత్తనాలు మూడు నాలుగు పంటలకు విత్తు సమస్య రాకుండా సరిపోతాయని పరిశోధన స్థానం ఏడీఆర్​ డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఎక్కువ కేంద్రాల ద్వారా రైతులకు సరిపడా విత్తనాలు అందించాలని సాగుదారులు కోరుతున్నారు.

'మన ప్రాంతంలో వరి ప్రాధాన్య గల పంట. దాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు కొన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచాం. ఈ విత్తనాలతో రైతులు వాన కాలంలో సాగు చేసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. మంచి దిగుబడి వస్తుంది. రైతులకు ఒక ఎకరానికి అయిన సరిపడే విత్తనం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రైతులందరూ సహకరించాలని కోరాం. బయట ప్రైవేట్​లో కూడా రైతులకు విత్తనాలు లభిస్తున్నాయి. కానీ పరిశోధ కేంద్రంలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. దాని నాణ్యత కూడా బాగుంటుంది. ఈ విత్తనాలను మరో రెండు మూడు సీజన్​లో కూడా వాడుకోవచ్చు'- డా. శ్రీనివాస్‌, ప్రాంతీయ పరిశోధన స్థానం ఏడీఆర్‌

karimnagar Seeds Society : స్వయంగా విత్తనోత్పత్తి చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ధర్మరాజు పల్లి

కల్తీ విత్తనాలకు చెక్‌ పెట్టడంపై ప్రభుత్వ ఫోకస్ - మరి కొత్త విధానమైనా వీటిని ఆపేనా? - FAKE SEEDS in TELANGANA

ABOUT THE AUTHOR

...view details