తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ దొంగ రూటే సెపరేటు - యూట్యూబ్​లో చూసి చైన్ స్నాచింగ్ - CHAIN SNATCHING CASE KUKATPALLY

ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ - యూట్యూబ్​లో చూసి దొంగతనానికి పాల్పడ్డ ఓ ఫార్మా కంపెనీ సెక్యూరిటీ గార్డు​ - నిందితుడ్ని పట్టుకున్న కూకట్​పల్లి డిటెక్టివ్ పోలీసులు

CHAIN SNATCHING CASE
KUKATPALLY POLICE PRESS MEET (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2025, 9:25 PM IST

Chain Snatching in Kukatpally : హైదరాబాద్​లో చైన్​ స్నాచింగ్​కు పాల్పడిన ఓ ఫార్మా కంపెనీలోని సెక్యూరిటీ గార్డును కూకట్​పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రావు ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కొట్టి సాయిరాం అనే వ్యక్తి నెల రోజుల క్రితం హైదరాబాద్​కు వచ్చాడు. కూకట్​పల్లిలోని ప్రశాంత్ నగర్​లో ఓ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు.

గొలుసు కొట్టేసి, తాకట్టు పెట్టి : ఈనెల జనవరి 3 వ తేదీన బాలాజీ నగర్​లో ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాన్ని నిందితుడు సాయిరాం చోరీ చేసాడు. అదే రోజు ఆ వాహనాన్ని ఉపయోగించి వివేకానంద నగర్ కాలనీలో శ్వేతా అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును చోరీ చేసి పరారయ్యాడు. చోరీ చేసిన గొలుసును ముత్తూట్ ఫైనాన్స్​ సంస్థలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు.

శ్రమించి పట్టుకున్న పోలీసులు : బాధితురాలు శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్​పల్లి పోలీసులు సుమారుగా 180 సీసీ ఫుటేజీలను పరిశీలించి నేరస్థుడిని గుర్తించారు. ద్విచక్ర వాహనాన్ని చోరీ చేయడంతో పాటు గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కొట్టి సాయిరాం అనే నిర్దారించుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముత్తూట్ ఫైనాన్స్​కు నోటీసులు జారీచేశారు. కొట్టి సాయిరాం దొంగిలించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో ఆంధ్రప్రదేశ్​లోని ముదినేపల్లిలో 5 వాహనాల చోరీ కేసులలో ప్రత్యక్షంగా ఉన్నాడని కూకట్​పల్లి ఏసీపీ శ్రీనివాస్​ రావు వెల్లడించారు.

యూట్యూబ్​లో చూసి దొంగతనం : పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన వివరాలను తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్​ అయ్యారు. ఎందుకంటే ఈ దొంగతనాలను నిందితుడు ఎలా చేయ్యాలి అనే విషయాలను యూట్యూబ్​లో చూసి నేర్చుకున్నట్లు వారికి వివరించాడు.

నిర్మల్​ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ ​స్నాచర్లు - మహిళ మెడలో నుంచి 3 తులాల గోల్డ్​చైన్​ అపహరణ - Chain Snatching AT Nirmal

Chain Snatching At Hayatnagar : ఒంటరిగా షాప్​కు వెళ్లితే.. పుస్తెలతాడు చోరీ

ABOUT THE AUTHOR

...view details