School students Name in voter list: ఓటుహక్కు పొందాలంటే 18 ఏళ్లు నిండాలి. కానీ పల్నాడు జిల్లాలో పాఠశాల విద్యార్థులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 28లో 10మంది పాఠశాల విద్యార్థుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. బీఎల్ఓ కిరణే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
స్కూల్ విద్యార్థులకు ఓటుహక్కు: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మాజీగూడెంలో హైస్కూల్ విద్యార్థుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. పోలింగ్ బూత్ నెంబర్ 28లో 12 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకూ వయసున్న 10మంది పిల్లలను ఓటర్లుగా చేర్చారని ప్రతిపక్ష తెలుగుదేశం చెబుతోంది. ఓటర్ల జాబితాలో పేర్లున్న విద్యార్థులు వివరాలను పరిశీలిస్తే ఓటర్ సీరియల్ నెంబర్ 1039 పేరుతో ఉన్న ఓర్సు చంద్రకళ సత్తెనపల్లి గర్ల్స్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోందని అన్నారు. ఓటర్ సీరియల్ నెంబర్ 1037లో ఉన్న ఓర్సు శివగోపి పాపాయిపాలెం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థినిగా గుర్తించారు. ఓటర్ సీరియల్ నెంబర్ 1027 పేరిట ఉన్న కూరాకుల హిమబిందు బెల్లంకొండ అడ్డరోడ్డు కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
ఓటర్ సీరియల్ నెంబర్ 1028లో ఉన్న తమ్మిశెట్టి మహాలక్ష్మి సత్తెనపల్లి గర్ల్స్ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థిని. ఓటర్ సీరియల్ నెంబర్ 1026లో పేరున్న ఓర్సు లక్ష్మీతిరుపతమ్మ ఎమ్మాజీ గూడెం పాఠశాలలో 7వ తరగతి డ్రాప్ అవుట్‌గా తేలింది. ఓటర్ సీరియల్ నెంబర్ 1031లో ఉన్న రావూరి మనోజ్ కుమార్ పాపాయపాలెం జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఓటర్ సీరియల్ నెంబర్ 1040లో తురక నీలిమ పేరంచర్ల ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని.
రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ - ఓట్ల అక్రమాలపై విచారణ జరిపించాలి : పురందేశ్వరి