School Students Appeal To Minister Anam And Collector To Build Road : "సార్, సార్ మా ఊరికి రోడ్డు వేయండి. స్కూలుకి వెళ్లలేక పోతున్నాం. ఫ్రెండ్స్ ఎవరూ దగ్గరకు రావటం లేదు. కాళ్లకు మొత్తం బురద అంటడంతో ఒకరి పక్కన మరొకరు కూర్చోలేక పోతున్నాం. ఇంటి నుంచి శుభ్రంగా రెడీ అయ్యి పాఠశాలకు వెళ్లే లోగా బట్టలు పాడవుతున్నాయి. చూట్టూ వర్షపు నీరు ఉండటంతో రోడ్డుపై నడవలేక పోతున్నాం. మా గోడు విని రోడ్డు వేయండి సార్" అంటూ స్కూలుకు వెళ్లే చిన్నారులు తమ బుజ్జి బుజ్జి మాటలతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి దిగిన విద్యార్థులు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామంలో మట్టి రోడ్డు అధ్వానంగా మారింది. చిన్న వర్షం పడినా రోడ్లపై నీరు నిలిచి బురదమయం అవుతోంది. గుంతల్లో నీరు చేరటంతో ఎప్పుడూ దుర్వాసన వెదజల్లుతోంది. అలాగే విపరీంతగా దోమలు వృద్ధి చెంది సైర్వ విహారం చేస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై గ్రామస్థులు ఎన్ని సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో పాఠశాలలో చదివే విద్యార్థులే రంగంలోకి దిగారు. తమ గ్రామ బాధ్యతను భుజాలపై వేసుకొని జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్కు తమ గొడు చెప్పుకున్నారు. తమ ఊరికి రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు.
'దారి' కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయ కుటుంబం.. చక్రాల కుర్చీలో తాడేపల్లి బాట