SBI Super Bike Loan Scheme Details: ప్రజల నిత్యావసరాల్లో ద్విచక్ర వాహనం ఓ భాగమైంది. ఇంటి పనులకు తప్పనిసరిగా ఓ బైక్ లేదా స్కూటర్ ఉండాలని అందరూ కోరుకొంటున్నారు. అలాగే కొంతమంది ఉద్యోగాలకు, ఇతర పనులకు వాటిపైనే వెళ్తుంటారు. ఇక యూత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఖరీదైన, స్పోర్ట్స్ మోడల్స్ తమ ఇంటి ముందు స్టాండ్ మోడ్‌లో ఉండాలని ఆశపడుతుంటారు. అందుకే.. నిత్యం వేలాది బైకులు అమ్ముడవుతుంటాయి. అయితే.. కొంత మందికి బైక్ కొనుగోలు చేయాలనే కోరిక విపరీతంగా ఉన్నప్పటికీ.. డబ్బులు మాత్రం పూర్తిస్థాయిలో ఉండవు. ఇతర అవసరాలు ఉండడంతో.. బైక్ కోరికను వాయిదా వేస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసమే SBI సూపర్ బైక్ లోన్ స్కీమ్ తెచ్చింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం..
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తూ వస్తోంది. వీటిల్లో లోన్స్ కూడా ఒకటి. హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ఇలా వివిధ రకాల రుణాలను తమ వినియోగదారుల కోసం అందిస్తోంది. తాజాగా ద్విచక్ర వాహన కొనుగోలు కోసం సూపర్ బైక్ లోన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా అర్హత కలిగిన కస్టమర్లు బ్యాంక్ నిబంధనల మేరకు రుణం పొందవచ్చు. అయితే.. ఎస్‌బీఐ సూపర్ బైక్ లోన్ పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవేంటంటే..
వయసు:ఈ స్కీమ్‌కు అప్లై చేయాలనుకునేవారి వయసు 21 నుంచి 57 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
లోన్ అమోంట్: కనిష్ఠంగా రూ.1.50లక్షల నుంచి అవసరం మేరకు బ్యాంకు అధికారులు వివరిస్తారు.