తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్రాంతికి ఇంటికొచ్చిన కొత్తల్లుడు - ఊహించని సర్​ప్రైజ్ ఇచ్చిన అత్తామామలు - SON IN LAW TREATED 108 FOOD ITEMS

కొత్త అల్లుడికి అత్తమామల సర్​ప్రైజ్ - 108 రకాల వంటకాలతో విందు ఏర్పాటు

Sangareddy Son in Law Surprised with 108 Types of Food
Sangareddy Son in Law Surprised with 108 Types of Food (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 13, 2025, 1:41 PM IST

Sangareddy Son in Law Surprised with 108 Types of Food :సంక్రాంతి అంటే కొత్త అల్లుడు ఇంటికి రావాలి. ఆయనకు వీలైనన్ని వంటకాలు చేసి పెట్టాలి. మామూలుగా ఇది ఆంధ్రప్రదేశ్​లోని సంస్కృతి. కానీ తెలంగాణలోనూ ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నారు. పండక్కి వచ్చిన కొత్త అల్లుళ్లకు వందల రకాల వంటకాలు చేసి వడ్డించి సకల మర్యాదలు చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డిలో కొత్త అల్లుడికి 108 రకాల వంటకాలను వడ్డించారు అమ్మాయి కుటుంబీకులు. అదే పట్టణానికి చెందిన రాములు కుమార్తె డా.నిషాకు ఇటీవలే డా.శ్రీకాంత్​తో వివాహం జరిగింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన అల్లుడికి 108 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. దీంతో అల్లుడు ఆనందం వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన తన కోసం అత్తామామలు ఇంత కష్టపడి అన్ని రకాల వంటకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వాళ్లు చేసిన వంటకాలను ఖుషీగా ఆరగించారు.

సంక్రాంతికి కొత్త అల్లుల్ల హవా - వందకు పైగా వంటకాలతో మర్యాదలు (ETV Bharat)

కొత్త అల్లుడికి సర్పైజ్​ - 300 రకాల వంటలతో విందు

ఆంధ్రా అల్లుడికి తెలంగాణ వంటకాలు : సంక్రాంతి పండుగకు హైదరాబాద్​ వచ్చిన ఓ ఆంధ్రా అల్లుడికి అత్తింటివారి మర్యాదలు అబ్బురపరిచాయి. పెళ్లయిన తర్వాత తొలిసారి వచ్చిన అల్లుడికి అత్తమామలు 130 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. కాకినాడకు చెందిన వారి అల్లుడికి తెలంగాణ వంటకాల రుచి చూపించి ఆనందపరిచారు. సరుర్​నగర్​ సమీపంలోని శారదానగర్​లో నివాసముంటున్న క్రాంతి- కల్పన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కుమార్తెను కాకినాడకు చెందిన మల్లిఖార్జున్​తో నాలుగు నెలల క్రితం పెళ్లి చేశారు. సంక్రాంతికి తొలిసారి అల్లుడు రావడంతో ఆయన్ని సర్​ప్రైజ్ చేసేందుకు మాంసాహారం, శాకాహారం, పులిహోరా, స్వీట్స్, పిండివంటలు, ఐస్​ క్రీమ్స్ లాంటి 130 రకాలు వంటకాలు చేశారు.

మొన్నేమో 173.. ఇప్పుడేమో 379 వంటకాలు.. ఏంటో ఈ గోదారోళ్ల మర్యాదలు

సంక్రాంతి స్పెషల్ : ఆంధ్ర అల్లుడికి 130 రకాల 'హైదరాబాద్' వంటకాలు

ABOUT THE AUTHOR

...view details