Sangareddy Degree women College Safety Issue :సంగారెడ్డిలోని డిగ్రీ మహిళా కళాశాల సమస్యలకు నిలయంగా మారింది. తొమ్మిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ కాలేజీలో విద్యార్థినుల వసతి గృహం ఉంది. ఐతే స్థానికులు కృత్రిమంగా సమస్యలు సృష్టించడం నిత్యకృత్యమైంది. విద్యార్థినుల మూత్రశాల మెట్లను పూర్తిగా ధ్వంసం చేశారు. రాత్రివేళ మందుబాబులు లోనికి ప్రవేశించి విద్యార్థినుల హాస్టల్ పక్కనే ఉన్న తరగతి గదుల్లో నానా యాగి చేస్తున్నారు. అంతటితో ఆగని ఆకతాయిలు తాళం వేసిన తలుపులను రాడ్లతో ధ్వంసం చేస్తున్నారు. కాలేజీ వసతి గృహం వద్దకు అబ్బాయిలు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్లో యువతికి అసభ్యకరమైన సందేశాలు - దేహశుద్ధి చేసిన కుటుంబ సభ్యులు
"సెలవు రోజుల్లో ఆకతాయిల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తలుపులు, గోడను పగులగొట్టి ఇబ్బందులు సృష్టిస్తున్నారు. బొటానికల్ గార్డెన్లో మొక్కలను నాశనం చేస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే మాపై తిరిగి వాగ్వాదానికి దిగుతున్నారు. వాష్‌రూం మెట్లను ధ్వంసం చేశారు. భోజన సమయంలో యువకులు కామెంట్లు చేస్తున్నారు. ఒక వాచ్‌మెన్‌ను కేటాయించాలి." - విద్యార్థినులు
Harassment in Sangareddy Women's College : వసతిగృహం వద్ద బయట కుర్చోవాలంటేనే భయం వేస్తోందని చెబుతున్నారు. వాచ్‌మెన్ లేకపోవడంతో స్థానికులు రెచ్చిపోతున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మహిళా కాలేజీ కావడంతో అడిగే వాళ్లు లేరనే ఉద్దేశంతో స్థానికుల వికృత చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కళాశాల ప్రాంగాణానికి ప్రధానంగా రెండు గేట్లు ఉన్నాయి. ప్రధాన ద్వారం నుంచి కళాశాల వెనుక నుంచి ఉన్న గేటు ద్వారా వెళ్తే స్థానికులకు దూరం తగ్గుతుందనే ఉద్దేశంతో గోడను కూల్చి వేసి మార్గంగా ఏర్పాటు చేసుకున్నారు. గేట్లకు తాళాలు వేస్తే వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆకతాయిల ఆగడాలపై ప్రశ్నిస్తే స్థానికులు దుర్భాషలాడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు.
వేధింపులు భరించలేమంటూ విద్యార్థినుల ధర్నా - ప్రిన్సిపల్ సస్పెండ్