Adulterated Alcohol Sales Increasing in Telangana : రాష్ట్రంలో కల్తీ మద్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. సీసా మూత తీసి కల్తీ చేస్తే తెలిసిపోతుందని అనుమానం రాకుండా మళ్లీ బిగిస్తున్నారు. జిల్లాకేంద్రం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం కల్తీ ఆనవాళ్లు వెలుగు చూసినట్లు మద్యం ప్రియులు అంటున్నారు. విలువైన మద్యాన్ని కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై 'ఈటీవీ భారత్' కథనం
తాగితే స్పిరిట్ వాసన :ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలోంచి తెచ్చిన రూ.2 వేల పైచిలుకు విలువైన మద్యం ఫుల్ బాటిల్ ఇంటికి వచ్చే సరికి లీకై కారింది. సీసాలో మిగిలిన మద్యాన్ని తాగిన సమయంలో స్పిరిట్ వాసన వచ్చిందని కొనుగోలుదారులు తెలిపారు. మద్యం సీసా మూత తీసి కల్తీ చేసి ఎవరికీ అనుమానం రాకుండా మూత మళ్లీ పెట్టారని సందేహం వ్యక్తం చేశారు.
రామారెడ్డి మండల కేంద్రంలోని మద్యం దుకాణంలో సైతం మండలంలోని రెండు గ్రామాలకు చెందిన ఇద్దరు వేర్వేరుగా కొనుగోలు చేసిన రెండు మద్యం సీసాలు ఇదే విధంగా కారిపోయాయని వాపోయారు. ఉమ్మడి మాచారెడ్డి మండంలోని మద్యం దుకాణాల్లో సైతం ఈ విధంగా అక్రమాలు వెలుగు చూశాయని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆబ్కారీ శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు కేసులు చేసిన పలు సందర్భాలు వెలుగు చూశాయి.
రూ.కోటి 20 లక్షల విలువైన నకిలీ మద్యం ధ్వంసం
అందులో పని చేసిన వారిని నియమించుకుని మరీ : గోలా మూత ఉండడం వల్ల సీసాలోంచి మద్యాన్ని బయటకు తీయడమే కానీ లోనికి పోసేందుకు అవకాశముండదు. కానీ నైపుణ్యం ఉన్న కొందరు మాత్రం గోలా మూతతో సహా బయటకు తీస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫుల్ బాటిల్‌లోని మద్యాన్ని బయటకు తీసి నీళ్లు, స్పిరిట్, ఇతర చౌకబారు మద్యాన్ని నింపి మూత యథావిధిగా బిగిస్తున్నారు. దీనికి మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేసిన వారిని ప్రత్యేకంగా నియమించుకుని ఇలాంటి పనులు చేయిస్తున్నారు. ఇక మామూలు ఆఫ్ బాటిల్, క్వార్ట్‌లోలలో ఈజీగా మూతలు తీసి కల్తీ చేస్తుంటారు. అయితే ఈ పనులు చేసే వారు మూతలు తీసి తీసి కల్తీ చేసే వారి కుడి-ఎడమ చేతులకు అరచేతుల్లోని బొటన వేళ్ల కింద ప్రాంతం కాయలు కాసే అవకాశముంటుంది.
జిల్లాలో 49 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా వందల సంఖ్యలో మద్యం గొలుసు దుకాణాలు వెలిసిన విషయం బహిరంగ రహస్యమే. వివిధ మార్గాల ద్వారా జిల్లా వ్యాప్తంగా నెలకు సుమారు రూ.45 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నిత్యం రూ.1.50మేర మద్యం అమ్ముడవుతోంది.
గుట్టుగా నకిలీ మద్యం సరఫరా.. గుట్టురట్టు చేసిన పోలీసులు
Huge Applications for Liquor Shops Licenses : ఎక్సైజ్‌శాఖకు కిక్కే కిక్కు.. మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా రూ.2వేల కోట్ల ఆదాయం