RTC Md Sajjanar Appreciates Conductor And Bus Driver:బస్సులో గుండె నొప్పితో బాధపడుతున్న ఓ విద్యార్థికి సకాలంలో వైద్య సాయం అందించి ఉదారత చాటుకున్న తమ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. బుధవారం హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో నిర్మల్ జిల్లా భైంసా డిపోకు చెందిన కండక్టర్ జి.గంగాధర్, బస్సు డ్రైవర్ బి.గంగాధర్‌లను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.
ఈ నెల 9న భైంసా నుంచి నిర్మల్‌కు బస్సు వెళ్తుండగా దిలావర్‌పూర్ వద్దకు రాగానే బస్సులో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల విద్యార్థి కిరణ్‌కు గుండె నొప్పి వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సులో కుప్పకూలిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ జి.గంగాధర్ అప్రమత్తమై డ్రైవర్‌కు చెప్పి బస్సును పక్కకు ఆపారు. డ్రైవర్ బి.గంగాధర్‌తో కలిసి ప్రాథమిక చికిత్స అందించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో వెంటనే కిరణ్‌ను బస్సులోనే సమీపంలో ఉన్న నర్సాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు కిరణ్‌కు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.