Vanibala Arrested in TSCAB Investment Scam :అధిక వడ్డీ వస్తాయని ఆశ చూపించి సహోద్యోగులు, తెలిసిన వ్యక్తుల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి మోసంలో టెస్కాబ్ మాజీ జీఎం నిమ్మగడ్డ వాణీబాల, ఆమె భర్త శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్స్ వ్యవస్థాపకుడు మేక నేతాజీ, వీరి కుమారుడు శ్రీహర్షను హైదరాబాద్ నగర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం రిమాండుకు తరలించినట్లు హైదరాబాద్ సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. నిందితులు అధిక లాభాల ఆశ చూపించి దాదాపు 140 మంది మోసం చేసిన వారి నుంచి రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా వాసి మేక నేతాజీ(64) 1985లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్స్ సంస్థను అబిడ్స్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే బంధువులు, పరిచయస్థులను నమ్మించి 24 శాతం చొప్పున నెలవారీగా లాభాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించేవారు. ఆ తర్వాత ప్రింటింగ్ సామగ్రి పంపిణీ వ్యాపారం, జీడిమెట్లలో శ్రీ ప్రియాంక గ్రాఫ్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్టీలు ఉత్పత్తుల తయారీ సంస్థ ఏర్పాటు చేశారు. వీటికి బీటెక్ పూర్తి చేసిన ఆయన కుమారుడు శ్రీహర్ష(32) డైరెక్టర్‌గా విధులు నిర్వహించేవాడు.
అధిక వడ్డీ ఆశ చూపారు - రూ.200 కోట్లతో ఉడాయించారు - Investment Fraud in Abids
తన భర్త కంపెనీలో పెడితే లాభాలొస్తాయని ఆశ చూపి :నేతాజీ భార్య వాణీబాలటెస్కాబ్(టీఎస్‌సీఏబీ)లో జనరల్ మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఆమె తన భర్త, కుమారుడు నడిపే ఫైనాన్స్ కంపెనీలో అధిక లాభాలు వస్తున్నాయంటూ సహోద్యోగులు, తమ బ్యాంకు ఖాతాదారులు, విశ్రాంత ఉద్యోగులను నమ్మించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బు, పదవీ విరమణ ప్రయోజనాల సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేస్తే తక్కువ వడ్డీ వస్తుందని, తన భర్త కంపెనీలో పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశ పెట్టేవారు.
ఆమె మాట విని దాదాపు 140 మంది ఉద్యోగులు రూ.26 కోట్ల మేర తన భర్త కంపెనీలో పెట్టుబడి పెట్టారు. కొందరు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ చేసినట్లు తెలిసింది. కొన్నాళ్లపాటు అందరికీ వడ్డీలు సమయానికి చెల్లించి, ఒక్కసారిగా బోర్డు తిప్పేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఇటీవల సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నిందితులు ముగ్గురూ పరారిలో ఉన్నారు. కేసు దర్యాప్తు చేసిన ఏసీపీ కిరణ్‌కుమార్ టీమ్ తాజాగా వీరిని అరెస్టు చేసింది. విచారణలో నెలకు 24 శాతం రిటర్న్స్ ఇస్తామని అందరికి ఆశ చూపించారని తెలిసింది. దాదాపు 532 మంది నుంచి డిపాజిట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ముందు నమ్మించారు - తర్వాత రూ. 200 కోట్లతో నిండా ముంచారు - 200 CRORE FRAUD IN HYDERABAD
పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు - ప్రజల ఖాతా ఖాళీ చేయడమే ప్రధాన లక్ష్యంగా కేటుగాళ్ల పంథా - Investment Fraud in Hyderabad