Rowdy Sheeter Rape on Inter Student:ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ చదివే విద్యార్థినిపై రౌడీషీటర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. గురువారం కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిని వినయ్ అనే రౌడీషీటర్ కత్తితో బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అవమానంతో తలకు రాసే నూనె తాగి ఆత్మహత్యకు యత్నించింది.
హుటాహుటిన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రౌడీ షీటర్ వినయ్పై కేసు నమోదు చేశారు. నిందితుడిని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.