Rowdy Sheeter Killed Boy and Committed Suicide : సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిని చంపిన నాగరాజు అనే రౌడీషీటర్ సెల్ టవర్ పైకెక్కి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు కేబుల్ వైర్లు దొంగతనం చేశాడు. ఆ ఘటనను చూసిన శేఖర్ (13), విషయాన్ని దుకాణదారులకు తెలిపాడు. దీంతో నాగరాజును దుకాణదారుడు ప్రశ్నించగా, అక్కడ వాదోపవాదాలు జరిగాయి.
అనంతరం నాగరాజు ప్రకాశ్ అనే వ్యాపారి వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. దానికి నిరాకరించిన అతని తలపై కత్తితో దాడి చేశాడు. దొంగతనం గురించి దుకాణదారుడికు సమాచారం ఇచ్చాడన్న కోపంతో శేఖర్‌పై కోపంతో ఉన్న నాగరాజు, శనివారం రాత్రి మాట్లాడాలని బాలుడిని పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి ఆ బాలుడిని అతి దారుణంగా కత్తితో నరికి చంపిమృతదేహాన్ని చెరువులో పడేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు నాగరాజుకు ఫోన్ చేసి స్టేషన్‌కు రమ్మన్నారు. బాలుడిని తానే హత్య చేసినట్లు ఆ రౌడీషీటర్ పోలీసులతో చెప్పాడు. గజ ఈతగాళ్లతో పోలీసులు బాలుడి మృతదేహాన్ని చెరువు నుంచి బయటికి తీశారు. కాగా కుటుంబసభ్యుల ఆందోళనతో నాగరాజు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. కిందకు దించేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిపైనా కత్తితో దాడి చేశాడు.