Revanth Reddy and Team Dubai Tour : మూసీ అభివృద్ది ప్రణాళికలపై అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం దుబాయ్ వెళ్లింది. మూసీ అభివృద్ధి కోసం లండన్లోని థేమ్స్ నదిని అధ్యయనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం, దుబాయ్లో నిపుణులతో చర్చించింది. సుమారు 54 కిలోమీటర్ల మూసీ పరీవాహకం అభివృద్ధి, సుందరీకరణతో పాటు వాణిజ్య అవకాశాలపై చర్చించారు.
బీఆర్ఎస్ను 100 మీటర్ల బొంద తీసి పాతిపెడతా - సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Revanth Reddy on Musi River Development Discussion: పట్టణాభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవమున్న సుమారు 70 గ్లోబల్ సంస్థలతో సీఎం రేవంత్ బృందం చర్చించింది. ఆయా సంస్థలు వివిధ దేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించాయి. పలు ప్రముఖ సంస్థలు మూసీ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిని కనబరిచాయి. అవసరమైతే హైదరాబాద్ వచ్చి మూసీ పరిసరాలు పరిశీలించి తదుపరి చర్చలు చేపడతామని తెలిపాయి. ఈ అర్ధరాత్రి వరకు వివిధ సంస్థలతో సీఎం బృందం చర్చలు కొనసాగనున్నాయి. సమావేశాల తర్వాత దుబాయ్(CM Revanth Dubai Tour) నుంచి సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్కు బయలుదేరనుంది. ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి, దాన కిషోర్, ఆమ్రపాలి ఈ చర్చల్లో పాల్గొన్నారు.