Revanth Kumari Food Stall: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు ఉన్న క్రేజే వేరు. ఇక్కడి ఐటీ ఉద్యోగులు ఈ స్టాల్‌కు భారీ ఎత్తున క్యూ కడతారు. లంచ్, డిన్నర్ ఇలా అన్నీ ఈ స్టాల్లోనే కానిచ్చేస్తారు. ఈ స్టాల్‌కు ఉన్న క్రేజ్ చేసి యూట్యూబర్లు కూడా ఫుడ్ రివ్యూ ఇవ్వడం షురూ చేశారు. ఇంకేంటి, వారి పుణ్యమా అని మరింత పాపులారిటీ వచ్చి కుమారీ ఆంటీ బిజినెజ్ మూడు పూవులు ఆరు కాయలుగా బిజీబిజీ అయిపోయింది. అయితే ఈ స్టాల్ వల్ల ఐటీ కారిడార్‌లో (IT Corridor)ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తాజాగా దీన్ని పోలీసులు తొలగించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్ - ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సుకు అంగీకారం
Kumari Aunty Food Stall Hyderabad :అయితే ఈ స్టాల్‌కు ఉన్న పాపులారిటీ, కుమారి ఆంటీకి సెలబ్రిటీలు కూడా సపోర్ట్ ఇవ్వడం, మరోవైపు సోషల్ మీడియాలో ఈ స్టాల్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం వల్ల మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ స్టాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కుమారి ఫుడ్ స్టాల్‌ను యథాతథంగా కొనసాగించాలని ఆదేశించారు. ఎవరూ ఆ స్టాల్‌ను అక్కడి నుంచి తొలగించకూడదని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని తెలిపారు. ఇక త్వరలోనే కుమారి ఆంటీ పుడ్ స్టాల్(Kumari Food Stall)ను సందర్శించనున్నట్లు వెల్లడించారు. పుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. కుమారి ఆంటీ లాంటి వాళ్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాపాలనకు అర్థం అదేనని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి
Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ పుడ్ స్టాల్ వల్ల ఐటీ కారిడార్‌లోని తీగల వంతెన నుంచి ఐకియా జంక్షన్(IKIA Junction) మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు సూచించినా ఆమె పుడ్ స్టాల్ మార్చలేదని దీనివల్ల మంగళవారం రోజున ఆ పుడ్స్టాల్ను తొలగించినట్లు చెప్పారు. ఈ విషయం నెట్టింట తీవ్ర వైరల్ కావడం, పోలీసులపై నెటిజన్లు ఫైర్ అవ్వడంతో ఈ వ్యవహారం కాస్త సీఎం రేవంత్ రెడ్డిదృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం రేవంత్, కుమారి ఆంటీ పుడ్ స్టాల్‌ను యథాతథంగా కొనసాగించాలని తక్షణమే డీజీపీ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
మహాత్ముడి సిద్ధాంతమే దేశానికి శ్రీరామ రక్ష : సీఎం రేవంత్ రెడ్డి