తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ రాణి కుమిదిని నియామకం - Telangana New SEC Appoints

Government Appoints SEC : రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్​ అధికారిణి రాణి కుమిదిని నియమితులయ్యారు. అదేవిధంగా రాష్ట్ర విజిలెన్స్​ కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి ఎం.జి గోపాల్​ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Government Appoints SEC
Government Appoints SEC (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 10:00 AM IST

Updated : Sep 17, 2024, 10:19 AM IST

Government Appoints SEC :రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్​ అధికారి రాణి కుమిదిని నియమితులయ్యారు. 1988 బ్యాచ్​కు చెందిన రాణి కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అదే హోదాలో కొనసాగించింది.

3 ఏళ్లపాటు పదవిలో కొనసాగనున్న ఎస్​ఈసీ : తాజాగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా ఆమెను నియమించింది. ఇప్పటి వరకు ఎస్ఈసీగా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా రాణి కుమిదినిని నియమించారు. ఈ మేరకు ఆమెను ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్​ఈసీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

పూర్తైన పదవీ కాలం : రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా ఉన్న పార్థసారధి పదవీ కాలం ఇటీవలే పూర్తైంది. 2020 సెప్టెంబర్ 9న ఆయన ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 3 ఏళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని ఆ సమయంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా 2023 సెప్టెంబర్ 8తో పదవీ కాలం పూర్తైంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పార్థసారధి పదవీ కాలాన్ని అప్పట్లో ఏడాది పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కొద్దిరోజుల క్రితమే ముగిసింది. దీంతో ప్రభుత్వం తాజాగా కొత్త ఎస్​ఈసీ నియామకాన్ని చేపట్టింది.

రాష్ట్ర విజిలెన్స్​ కమిషనర్​గా ఎంజీ గోపాల్ : రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్​ను నియమించారు. 1983 బ్యాచ్​కు చెందిన ఎంజీ గోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్​గా మూడేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నేటితో ముగియనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి పదవీ కాలం - ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ - State Election Commission Candidate

పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్దం చేయండి - అధికారులకు ఎస్ఈ​సీ ఆదేశం - SEC Meeting on Panchayat Elections

Last Updated : Sep 17, 2024, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details