తెలంగాణ

telangana

ETV Bharat / state

'అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు వద్దు' - మోహన్​బాబుకు సుప్రీంలో ఊరట - SC ON MOHAN BABU CASE

మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం

SC ON MOHAN BABU CASE
SC ON MOHAN BABU CASE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 20 hours ago

Updated : 14 hours ago

SUPREME COURT On Mohan Babu Case : సీనియర్​ నటుడు మోహన్‌ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్‌ కోసం మోహన్‌బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులోనే ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ మోహన్​బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మోహన్​బాబుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఇదీ జరిగింది :మంచు కుటుంబ వివాదం నేపథ్యంలో జల్​పల్లిలోని మోహన్​బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు కొద్ది రోజుల క్రితం వెళ్లారు. ఈ క్రమంలోనే మోహన్​బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు, సహాయకులు గేటులోపల ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను బయటకు తోసేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు. ఓ మీడియా ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మోహన్​బాబు మైకు లాక్కుని కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కొద్దిరోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

Last Updated : 14 hours ago

ABOUT THE AUTHOR

...view details