Heavy Rains in AP :బంగాళాఖాతంలో వాయుగుండం తీరంవైపు దూసుకొస్తోంది. ఇది నెల్లూరు-పుదుచ్చేరి మధ్య గురువారం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
RAIN ALERT TO AP : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోంది. ఇది గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
తీరంవైపు దూసుకొస్తున్న దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని ఐఎండీ హెచ్చరించింది. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ - పలుచోట్ల విస్తారంగా వర్షాలు
కంట్రోల్ రూమ్ ఏర్పాటు :వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. రాత్రి నుంచి ఉరుములు మెరుపులుతో భారీ వర్షం పడుతోంది. కావలిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో గాలులు తీవ్రత పెరిగింది. పలు జిల్లాలో ఇవాళ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కంట్రోల్ రూమ్ | నంబర్ |
తిరుపతి కలెక్టరేట్ | 0877-2236007 |
గూడూరు సబ్ కలెక్టరేట్ | 86242 52807 |
సూళ్లూరుపేట ఆర్‌డీవో కార్యాలయం | 86232 95345 |
తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం | 70321 57040 |
శ్రీకాళహస్తి ఆర్‌డీవో కార్యాలయం | 99665 24952 |
ఏపీలో భారీ వర్షాలు - రేపు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Nellore District : తీర ప్రాంతాలైన కోట, చిల్లకూరు, వాకాడు, తడ మండలాల్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో (ఎస్డీఆర్ఎఫ్) బృందాలను సిద్ధంగా ఉంచారు. నెల్లూరు నగరంలోఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయ్యప్పగుడి సెంటర్, తల్పగిరి కాలనీ, రెవెన్యూ కాలనీ, చంద్రబాబు కాలనీ, వైఎస్సార్ కాలనీని ఇళ్లల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పెన్నా బ్రిడ్జి సమీపంలో పడిన గండిని పూడ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.