CM Chandrababu 100 Days Ruling :రాష్ట్రం వరద విపత్తులో చిక్కుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన పాలనాదక్షత భావితరాలకు, నాయకులకు ఓ పాఠం అని పలువురు క్రీడా, సినీ ప్రముఖులు కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో మరింత పురోగమిస్తుందని, అందుకు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం, విజన్ ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబుకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది :"ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల పాలన బాగుంది. సీఎం చంద్రబాబు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు తన విజన్‌తో రాష్ట్ర అభివృద్ధి పాటుపడుతున్నారు. చంద్రబాబుని చూసి గర్వపడుతున్నా. ప్రజల సుఖశాంతులు, సంతోషమే అజెండాగా పాలన సాగిస్తున్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తాను. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను."- సోనూ సూద్, ప్రముఖ సినీ నటుడు
అదీ చంద్రబాబు దక్షత :"వరద కష్టాల్లోంచి ప్రజలను బయట పడేయడంలో చంద్రబాబు విజన్, పాలన కనిపించాయి. విపత్తు నిర్వహణ ఎలా చేయాలో భావితరాలకో పాఠంలా చూపించారు. ఆయన పాలనాదక్షత వల్లే వరద కష్టాల్లోంచి ప్రజలు త్వరగా కోలుకున్నారు."-పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్
అన్నింటా.. ఏపీ అభివృద్ధి బాట :"ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్రం పురోగమిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆనాడు క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆఫ్రో-ఏషియన్ గేమ్స్‌కు హైదరాబాద్‌ను వేదికగా నిలిపారు. ఇప్పుడు ఆయన పాలనలో క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ ఏపీ అభివృద్ధి చెందాలి." -మిథాలీరాజ్, మహిళా క్రికెటర్