ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి: రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ - నిరుద్యోగ యువకులతో నిరసన

Rayalaseema Unemployment Roar With Unemployed Youth: జగన్​మోహన్​ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేసుకుందామని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీపై చిన్నచూపు చూస్తున్నారని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన కర్నూల్లో నిరుద్యోగ యువకులతో రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నట్లు శ్రీరాములు ప్రకటించారు.

Rayalaseema_Unemployment_Roar_With_Unemployed_Youth
Rayalaseema_Unemployment_Roar_With_Unemployed_Youth

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 4:06 PM IST

Rayalaseema Unemployment Roar With Unemployed Youth:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు (Youth) ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) ఉండాలని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన కర్నూల్లో దేవి ఫంక్షన్ హాల్ వద్ద నిరుద్యోగయువకులతో (Unemployee Youth) రాయలసీమ నిరుద్యోగ గర్జన నిర్వహిస్తున్నట్లు శ్రీరాములు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రిక (Wall Poster)ను మాజీ ఎమ్మెల్యే (Former MLA) గౌరు చరితా రెడ్డి స్వగృహం వద్ద ఆవిష్కరించారు.

నిరుద్యోగులకు ఇబ్బందులు: ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ 5 సంవత్సరాలైనా ఒక్క జాబ్ క్యాలెండర్ (Job Calendar) కూడా విడుదల చేయలేదని శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) హయాంలో యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో (YSRCP Gov)ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీరాములు పేర్కొన్నారు.

జగన్‌ సర్కార్‌ నిరుద్యోగులను మోసం చేసింది: యూటీఎఫ్

కేవలం 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ఇచ్చి జగన్ టీచర్ అభ్యర్థులను (Teacher Candidates) మోసం చేశారని శ్రీరాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా (Special Status to AP) తీసుకువచ్చి స్థానిక యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిజగన్ నయవంచన చేశారని శ్రీరాములు (sriramulu) విరుచుకుపడ్డారు.

మోసం చేసిన సీఎం జగన్​కు బుద్ధి చెప్తాం - నిరుద్యోగుల హెచ్చరిక

"జగన్ ప్రతిపక్ష నేతగా (Opposition Leader) ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా (Vacancies) ఉన్న 2 లక్షల 40వేల ఉద్యోగుల భర్తీ చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలు, యువత చేత ఓట్లు వేయించుకున్నారు. - శ్రీరాములు, రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్

సీఎం జగన్​ నిరుద్యోగులను మోసం చేశారు : టీఎన్​ఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్​ గోపాల్​

ABOUT THE AUTHOR

...view details