Ration Card KYC Last Date Extended :రేషన్ కార్డుదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గడువు జనవరి 31తో ముగుస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులను (Ration Card E KYC) ఆధార్ నంబర్‌తో అనుసంధానించే గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ 75.76 శాతం పూర్తయిందని పౌర సరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Ration Card E KYC Last Date :తెలంగాణలో 2014 నుంచి రేషన్ కార్డుల (Ration cards in Telangana) ప్రక్షాళన చేపట్టలేదు. మరణించినవారి పేర్లు, వివాహాలు చేసుకొని వెళ్లిపోయిన ఆడపిల్లల పేర్లు తొలగించకుండా బియ్యం కోటాను తీసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. దీంతో బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతోపాటు రేషన్ సరకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు అప్డేట్ కొరకు, గత సంవత్సరం సెప్టెంబరులో ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల వివరాలతో పాటు వేలిముద్రలను మరోసారి సేకరిస్తున్నారు.
అలర్ట్ - రేషన్ కార్డుల KYC లాస్ట్‌డేట్ వచ్చేసింది!
ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ :
- రేషన్ కార్డులో పేరు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి 'ఈ-పాస్' యంత్రంలో మరోసారి వేలిముద్రలు వేయాలి.
- అక్కడ మీరు వేలి ముద్ర వేయగానే రేషన్‌కార్డు నంబర్‌తో పాటు కార్డు సభ్యుల ఆధార్‌కార్డు నంబర్ చూపిస్తుంది.
- వీటిని సరి చూసిన తరువాత ఆ మిషన్‌లో గ్రీన్ లైట్ వెలిగి సదరు సభ్యుల కేవైసీ పునరుద్ధరణ జరుగుతుంది.
- ఒకవేళ రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం చేసుకోవచ్చు. దీంతో రేషన్ కార్డ్ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు.
- రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్‌షాప్‌కి వెళ్లాలి.