ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో అరుదైన చికిత్స- ఇన్ ఫెక్షన్ సోకిన వ్యక్తికి పశువు రక్తనాళం - RARE SURGERY IN VIKAS HOSPITAL

ఓ వ్యక్తికి ఇన్ ఫెక్షన్ సోకి పొట్టలోకి రక్తం కారుతున్నట్లు నిర్ధారించిన వైద్యులు - పాడైన రక్తనాళం స్థానంలో పశువు గుండె నుంచి తీసిన రక్తనాళం అమరిక

Rare Surgery in Guntur Vikas Hospital
Rare Surgery in Guntur Vikas Hospital (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 7:56 PM IST

Rare Surgery in Guntur Vikas Hospital : గుంటూరు వికాస్ ఆసుపత్రి వైద్యులు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా అరుదైన శస్త్రచికిత్స చేశారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాము అనే వ్యక్తి కడుపు నొప్పి సమస్యతో వైద్యులను కలిశారు. గుండె నుంచి శరీరానికి రక్తం సరఫరా చేసే రక్తనాళం ఇన్ ఫెక్షన్ కు గురై ఉబ్బిపోయి పొట్టలోకి రక్తం కారుతోందని నిర్ధారించారు. దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని చెన్నై వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు రూ. 20 లక్షలు అవుతుందని చెప్పడంతో అంత డబ్బు లేక రాము తిరిగి వచ్చేశారు.

పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు : గుంటూరు వికాస్ ఆసుపత్రిలో ఈ తరహా జబ్బుకు ఆపరేషన్ చేస్తారని తెలియటంతో వారిని సంప్రదించారు. వికాస్ ఆసుపత్రి వైద్యులు సురేంద్ర ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే రక్త నాళం ఇన్ ఫెక్షన్ కు గురి కావటంతో దాని స్థానంలో పశువు గుండె నుంచి తీసిన రక్తనాళాన్ని అమర్చి ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం రాము ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యులు తనకు పునర్జన్మ ప్రసాదించారని రాము కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ వైద్యసేవలో ఇలాంటి ప్రమాదకర జబ్బులకు చికిత్స అందించే వీలుండటం వల్లే ఆపరేషన్ సాధ్యమైందని వికాస్ వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details