ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం - వీడియో తీసిన యువకులు, కోరిక తీర్చాలంటూ బెదిరింపులు - RAPE ON 10TH CLASS STUDENT - RAPE ON 10TH CLASS STUDENT

Rape on 10th Class Student in Eluru District: పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఇది తప్పని చెప్పాల్సిన వారు వీడియో తీసి బెదిరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన ఏలూరు జిల్లా చోటు చేసుకుంది.

rape on 10th class student
rape on 10th class student (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 10:35 AM IST

Rape on 10th Class Student in Eluru District :సమాజంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్‌లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు.

పోర్న్ వీడియోలకు బానిసైన ట్విన్స్- సొంత సోదరితోనే లైంగిక సంబంధం- గర్భం దాల్చిన బాలిక- ఆఖరికి! - Sister Pregnant By Brother

గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం :పోలీసుల కథనం మేరకు మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15న మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడ మాటువేసిన సహ విద్యార్థి బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఫేక్​ రేప్​ కేసు పెట్టిన మహిళకు 4ఏళ్లు శిక్ష- ఆ యువకుడిలాగే ఆమె కూడా జైల్లో ఉండాలని తీర్పు - Youth Gets Justice After 4 Years

కోరిక తీర్చాలంటూ బలవంతం :అత్యాచార సంఘటనను బాల సుబ్రహ్మణ్యం(22), చంద్రశేఖర్‌(22), తేజ(19), హరికృష్ణ(20) వీడియో తీశారు. అనంతరం బాలికకు వీడియో చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులనూ బెదిరించారు. 2 లక్షల రూపాయలు ఇస్తామని వారు ప్రాధేయపడినా వారు భారీ మొత్తంలో నగదు డిమాండ్‌ చేశారు. దాంతో పాటు వీడియోను వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. కైకలూరు గ్రామీణ సీఐ కృష్ణ కుమార్, మండవల్లి ఎస్సై రామచంద్ర రావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జునైల్‌ హోమ్‌కు తరలించారు. బాధితురాలిని వేధింపులకు గురి చేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి పద్నాలుగు రోజులు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడిపై రివెంజ్​- 8నెలల గర్భిణీపై గ్యాంగ్​రేప్​, పెట్రోల్ పోసి నిప్పు

ABOUT THE AUTHOR

...view details