Ramgopalpet police Notice To Hero Allu Arjun :పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఇప్పటికే బెయిల్ ముంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఆదివారం పోలీస్ స్టేషన్‌కి చేరుకొని ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ సమీక్షంలో అల్లుఅర్జున్ సంతకం చేశారు.
ఏం జరిగినా పూర్తి బాధ్యత మీదే : అల్లుఅర్జున్‌కు మళ్లీ పోలీసుల నోటీసులు - POLICE NOTICE TO ALLU ARJUN
అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నోటీసులు - చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బన్నీ
Published : Jan 5, 2025, 10:10 AM IST
|Updated : Jan 5, 2025, 3:42 PM IST
అల్లు అర్జున్ ఆసుపత్రికి రావడం లేదు :మరోవైపుఈ ఘటనలో గాయపడిన శ్రీ తేజను అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నేపథ్యంలో రాంగోపాల్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. కిమ్స్ ఆస్పత్రికి రావద్దంటూ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందని నోటీసులో వివరించారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులిచ్చిన నోటీసుల మేరకు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి రావట్లేదని ఆయన సంబంధిత వర్గాలు తెలిపాయి.
నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్